Minister KTR: ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ క్లాస్..
ABN , First Publish Date - 2023-07-11T15:45:29+05:30 IST
హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం జరగిన నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు.
హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah), ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (MLC Kadiyam Srihari) మధ్య వివాదం జరగిన నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు. అయితే కడియంపై చేసిన వ్యాఖ్యలపై రాజయ్య వివరణ ఇచ్చారు. ఇంకోసారి రిపీట్ కావద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పార్టీ అంతర్గత గొడవల వల్ల ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు రాజయ్య ప్రగతి భవన్‌లో కొద్దిసేపు వెయిట్ చేశారు. అయినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్నా గందరగోళంలో రాజయ్య ఉన్నారు.
రాజయ్య - కడియం మధ్య వివాదం..
ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం జరిగింది. కడియంపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి కులాన్ని తీసి మరీ రాజయ్య విమర్శలు గుప్పించారు. కడియం పద్మశాలీ కులానికి చెందిన వాడని.. కానీ 60 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో కడియం ప్రతి విమర్శలు చేశారు. రాజయ్య దళిత బంధులో కమీషన్లు దండుకున్నారని, బీఫామ్‌లు అమ్ముకున్నారని అన్నారు. పార్టీ లైన్ దాటి ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నా బీఆర్ఎస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. స్టేషన్ ఘనపూర్‌లో రెండు వర్గాలుగా బీఆర్ఎస్ విడిపోయింది. దీంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు.