Home » Kadiyam Srihari
పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది దోపిడీ, భూకబ్జాలేనని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య చాలాకాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
అవినీతి, అక్రమాల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలుకు వెళ్తామనే భయం పట్టుకుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కడియం శ్రీహరి గుట్టును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య విప్పారు. గతంలో కడియం శ్రీహరి డొక్కు స్కూటర్‌పై తిరిగే వారని గుర్తు చేశారు. అలాంటి కడియం శ్రీహరికి ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. ఆపై మంత్రి సైతం చేశారని వివరించారు.
Telangana: బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మరిచిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులు చేస్తున్నారని.. జ్ఞానం ఉందా అంటూ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాల్సింది పోయి రోడ్డు మీద కూర్చోవడం పద్ధతేనా అని నిలదీశారు.
Telangana: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్దని వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో ఉప ఎన్నిక రావని... వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందు కు అందరు దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇ
కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.