Minister Satyavati : వైద్య విద్యపై కేసీఆర్ లక్ష్యం అదే..
ABN , First Publish Date - 2023-09-15T16:28:02+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చొరువతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 9 మెడికల్ కళాశాలల(Medical Colleges)ను ప్రారంభించుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.
జయశంకర్ భూపాలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చొరువతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 9 మెడికల్ కళాశాలల(Medical Colleges)ను ప్రారంభించుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను వర్చువల్గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. భూపాలపల్లిలో మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా,శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు శ్రీహర్షిణి, పుట్ట మధు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యవిద్యార్థులుపాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా లక్ష్య ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఈ రోజుమెడికల్ సీట్ దొరుకుతుంది.ఒకప్పుడు కోట్లు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లి వైద్య విద్యను చదివేవారు.ఒకప్పుడు భూపాలపల్లిలో జ్వరం, ఏదైనా రోగం వస్తే వరంగల్, హైదరాబాద్కు వెళ్లే వారు. కానీ నేడు భూపాలపల్లిలో పెద్ద పెద్ద డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందుబాటులో ఉండనున్నారు. వైద్య విద్యను పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.