Warangal: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-06T15:06:20+05:30 IST

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా మురళీని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ చేతకానోళ్లే తొడలు కొడతారని.. మీసాలు తిప్పుతారని అన్నారు.

Warangal: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. కొండా మురళీ (Konda Murali)ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ చేతకానోళ్లే తొడలు కొడతారని.. మీసాలు తిప్పుతారని అన్నారు. వాళ్లు వెళ్లిపోయాక పరకాలలో గొడవలు, ఘర్షణలు లేని వాతావరణం ఉందన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి తేవొద్దని సూచించారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ (Dharani Portal) భారతదేశంలోనే అద్భుతమైన సైట్ అని.. వాళ్ల ఆటలు సాగడం లేదనే ధరణి తీసేస్తామంటున్నారని చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-06T15:06:20+05:30 IST