TS News: ఆస్పత్రిలో కరెంట్ షాక్... రోగి మృతి
ABN , First Publish Date - 2023-01-27T14:30:03+05:30 IST
ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది.
ములుగు: ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో కరెంట్ షాక్తో పేషెంట్ మార్త రమేష్(40) మృతి చెందాడు. బాత్రూమ్ అనుకొని పవర్ సప్లయ్ రూంలోకి వెళ్ళిన పేషెంట్.. కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రమేష్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.