TS News: మృతదేహాల తారుమారు... అంత్యక్రియల్లో అసలు విషయం తెలిశాక..
ABN , First Publish Date - 2023-03-25T17:08:21+05:30 IST
ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
వరంగల్: ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాందారిపల్లి (Kaandaarapalli) వాసి రాగుల రమేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ (Ramesh) మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీ అధికారులు ఇచ్చిన్నట్లు మృతుడి బంధువులు వాపోతున్నారు. అంత్యక్రియలు చేస్తుండగా గమనించిన బంధువులు ఆందోళనకు దిగారు.ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.