Share News

అక్కపైనే కన్నేశాడు.. ఒప్పుకోలేదని ఆమెకొడుకును చంపేశాడు

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:51 AM

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మరవపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న చేతన్‌(13) హత్య కేసును పోలీసులు ఛేదించారు.

అక్కపైనే కన్నేశాడు.. ఒప్పుకోలేదని ఆమెకొడుకును చంపేశాడు

  • బాలుడి హత్యకేసులో మేనమామ అరెస్టు

  • స్కూల్‌ నుంచి కిడ్నాప్‌ చేసి హత్య

  • చేతులు వెనక్కి కట్టి.. కత్తితో గొంతు కోసి పైశాచికం

  • కేసును ఛేదించిన ‘శ్రీసత్యసాయి’ పోలీసులు

పుట్టపర్తి రూరల్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మరవపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న చేతన్‌(13) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడికి వరుసకు మేనమామ అయ్యే అశోక్‌ హత్య చేసినట్లు తేల్చారు. అశోక్‌తోపాటు అతడి ప్రియురాలు నాగలక్ష్మమ్మను అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి డీపీలో ఆదివారం ఎస్పీ రత్న ఈ కేసు వివరాలను వెల్లడించారు. మరవపల్లికి చెందిన పుష్పవతి కుమారుడు చేతన్‌ మడకశిర మండలం ఆమిదాలగొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆమెకు వరుసకు సోదరుడైన అశోక్‌ పుష్పవతిపై కన్నేశాడు. ఆమె తిరస్కరించడంతో పగ పెంచుకున్నాడు. చేతన్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. చేతన్‌ హత్యకు సహకరిస్తే రూ.2 లక్షలు ఇస్తానని తన ప్రియురాలు నాగలక్ష్మికి చెప్పాడు. గతనెల 28న అశోక్‌ తన ద్విచక్రవాహనంపై మడకశిరకు వెళ్లి సంతలో కత్తి, టైన్‌పురి కొన్నాడు.

తర్వాత చేతన్‌ చదువుతున్న స్కూల్‌కు వెళ్లి జీపు బొమ్మ కొనిస్తానని నమ్మబలికి చేతన్‌ను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆమిదాలగొందిలో ఉన్న నాగలక్ష్మమ్మతో కలిసి హులిబెట్ట తండా కొండదగ్గర్లోని బీడు భూముల్లోకి వెళ్లారు. అక్కడ చేతన్‌ రెండు చేతులు కట్టేసి, కత్తితో గొంతుకోసి, చంపేశారు. నిందితుల కోసం పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మడకశిర పట్టణ పరిధిలోని వడ్డపాల్యం బైపాస్‌ వద్ద అశోక్‌, నాగలక్ష్మమ్మను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు.

Updated Date - Dec 02 , 2024 | 04:51 AM