Andhra Pradesh: ఏపీలో 18 మంది ఐఏఎస్‌లు బదిలీ.. ఆయన తిరిగొచ్చారు!
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:56 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయడం జరిగింది. మరోవైపు.. ఇన్నాళ్లు వైసీపీతో అంటకాగిన అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా బదిలీ చేసిన వారికి మళ్ళీ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ కలెక్టర్ మల్లికార్జున, గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, తూర్పు గోదావరి కలెక్టర్ మాధవి లతలను బదిలీ చేసిన సర్కార్.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీరంతా వైసీపీతో అంటకాగడంతో ఈ పరిస్థితి వచ్చింది.
బదిలీలు ఇలా..!
గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మీ
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున బదిలీ
మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు
అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ
అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ నియామకం
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్. అంబేడ్కర్ నియామకం
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ నియామకం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు బదిలీ..
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీడీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా
బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
సారొచ్చేసారు..!
భారీగా ఐఏఎస్‌లు బదిలీలు జరిగిన వేళ కేంద్రం నుంచి ఒకింత శుభవార్తే వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఏపీకి తిరిగి వచ్చేశారు. పీయూష్ కుమార్‌ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే DOPTకి సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో పియూష్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పీయూష్ కుమార్‌కు ఏపీ ఫైనాన్స్‌శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.