Anam Ramnarayana Reddy: 4 వేల పెన్షన్ ఇస్తామన్నా టీడీపీ హామీ మొదటి నెల నుంచే అమలు
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:49 PM
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పని చేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్ది తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 65 లక్షల పేద కుటుంబాలకు మంచి, మేలు, సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
నెల్లూరు: చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పని చేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్ది తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 65 లక్షల పేద కుటుంబాలకు మంచి, మేలు, సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పెన్షన్ విషయంలో పేదలను మోసం చేసిందని ఆనం తెలిపారు. రూ.3 వేలు ఇస్తానని ఇదేళ్ల పాలన చివరిలో ఇచ్చిందన్నారు. టీడీపీ 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మొదటి నెల నుంచే అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ గుర్తింపు పొందిన సచివాలయం ఉద్యోగుల ద్వారానే పెన్షన్ పంపిణి చేస్తామని ఆనం తెలిపారు.
‘‘ఐదు విభాగలుగా 12 రకాల పెన్షన్ దారులకు పంపిణీ చేస్తున్నాం. గతంలో 2700 కోట్ల.. నుంచి 4400 కోట్లుకు పెరిగాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా నామకారణం ద్వారా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. పంపిణీ విధానంలో పారదర్శికత ఉండేలా చూసుకుంటున్నాం. బయోమెట్రిక్ విధానం లేదా ఐరిష్ పద్ధతి ద్వారా పెన్షన్ ల పంపిణి చేస్తున్నాం. వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణి చేసి చూపిస్తాం. ప్రభుత్వానికి పెన్షన్ల పంపిణీకి బలమైన ప్రభుత్వ వ్యవస్థ ఉంది. తొలి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు పెన్షన్లను పూర్తి చేస్తాం. డీఎస్సీకి గత వైసిపీ ప్రభుత్వం నీళ్లొదిలింది. డిసెంబర్ మాసం లోగా మెగా డీఎస్సీ పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ విజయవంతంగా అమలు జరుగుతుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైసీపీ ప్రభుత్వ ల్యాండ్ టైటిల్ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం. రాబోయే శాసనసభ సమావేశాల్లో రద్దు ప్రతిపాదన ప్రభుత్వం తీసుకు రానుంది. యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 2024 ఎన్నికల్లో లక్షల మంది ఓటును వినియోగించుకొని కీలక పాత్ర పోషించారు. ఆకలి తీర్చడమన్నది భారతీయుల సంప్రదాయం. ఎన్టీఆర్ అన్నా క్యాంటిన్ ల రద్దు ద్వారా జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టారు. 188 అన్నా క్యాంటిన్లనుపునరుద్ధరించనున్నాం’’ అని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.