Share News

Amaravati : అడ్మిషన్లలో అయోమయం

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:26 AM

ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌పై అస్పష్టత నెలకొంది. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది.

Amaravati : అడ్మిషన్లలో అయోమయం

  • ఇంజనీరింగ్‌, డిగ్రీ కౌన్సెలింగ్‌పై అస్పష్టత

  • ప్రారంభం కాని ఇంజనీరింగ్‌ ఆప్షన్లు.. 4 రోజులే గడువు

  • వందకు పైగా డిగ్రీ కాలేజీలకు ఇంకా రాని అనుమతులు

  • పాత అధికారులతోనే ఈ తిప్పలు

  • అక్టోబరు 3 నుంచి టెట్‌.. ఆగస్టు 3 వరకు దరఖాస్తులు

  • ఇంజనీరింగ్‌, డిగ్రీ కౌన్సెలింగ్‌పై అస్పష్టత

  • ప్రారంభం కాని ఇంజనీరింగ్‌ ఆప్షన్లు

  • మరో నాలుగు రోజులే గడువు

  • పాత అధికారులతోనే ఈ తిప్పలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌పై అస్పష్టత నెలకొంది. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది. మొదట ప్రకటించిన తేదీల ప్రకారం సోమవారం నుంచి ఇంజనీరింగ్‌ కోర్సులకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం కొత్త ఫీజులు ఖరారు చేసింది. కానీ ఏఐసీటీఈ మం జూరు చేసిన సీట్లకు సోమవారం సాయంత్రం వరకూ ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలే దు.

సాయంత్రానికి సీట్లకు అనుమతుల జీవో జారీ చేసినా వాటిని కౌన్సెలింగ్‌లో పెట్టడానికి సాంకేతిక విద్యా శాఖ సమయం తీసుకుంది. మరోవైపు ఫీజుల అంశంలోనూ అదే అస్పష్టత కొనసాగుతోంది. 2023లో ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ మూడేళ్ల కాలానికి ఫీజులు సిఫారసు చేసింది. తొలుత కనిష్ఠ ఫీజు రూ.45 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలుగా నిర్ణయించింది.

ఆ సిఫారసులను గత ప్రభుత్వం ఆమోదించకుండా మార్చాలని ఒత్తి డి చేసింది. దీంతో కమిషన్‌ కనిష్ఠ ఫీజును రూ.40 వేలుకు తగ్గించింది. దీనిపై యాజమాన్యాలు కోర్టుకు వెళ్లగా కొద్ది రోజుల కిందట తీర్పు వచ్చింది. ఈ ప్రకారం కమిషన్‌ మొదటి సిఫారసులనే పరిగణనలోకి తీసుకోవాలి. అం టే కనిష్ఠ ఫీజు రూ.45 వేలుగా ఉండాలి. కానీ ఉన్నత విద్యా శాఖ అందుకు విరుద్ధంగా కనిష్ఠ ఫీజు రూ.40 వేలుగా నిర్ణయిస్తూ జీవో ఇచ్చిం ది. దీంతో ఫీజు విషయంలోనూ అస్పష్టత నెలకొంది. ఈ గందరగోళం మధ్య ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. షెడ్యూలు ప్రకారం ఐదు రోజులపాటు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సోమవా రం ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయి తే ఆప్షన్ల ప్రక్రియలో ఒక రోజు వృథా కావడం తో గడువు పెంచుతారా? లేదా? అనే దానిపై కూడా సాంకేతిక విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు.

డిగ్రీలోనూ గందరగోళం

డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్‌లోనూ ఇంజనీరిం గ్‌ తరహాలో గందరగోళం కొనసాగుతోంది. అనుమతులకు సంబంధించిన ఫీజులను గతేడాది కాలేజీలు చెల్లించాయి. ఒక్కో కాలేజీ రూ.30 వేలు చెల్లించగా.. ఆ ఫీజు మూడేళ్ల కాలానికని ఉన్నత విద్యామండలి తెలిపింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫీజులు కట్టాలని ఆదేశించింది. గతేడాది కట్టామంటూ కాలేజీలు అనుమతులకు ఫీజులు చెల్లించలేదు. అలాగే ఇప్పటికీ కొన్ని కాలేజీలకు అఫిలియేషన్లు మం జూరు కాలేదు. డిమాండ్‌ ఉన్న బీసీఏ, బీబీఏ కోర్సులకు ఈ నెల 15 వరకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. కానీ ఈ లోపే తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా షెడ్యూ లు జారీ చేశారు. తొలి విడతలో అనుమతు లు, అఫిలియేషన్లు పొందిన కాలేజీల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తాజాగా ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా వందకు పైగా కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని సంక్లిష్టంగా మార్చారు. అలాగే ఫీజు చెల్లించే సమయంలో యూపీఐ ద్వారా ఆప్షన్‌ లేకుండా చేశారు. విద్యార్థి చిరునామా విషయంలోనూ వెబ్‌సైట్‌ తప్పులు చూపిస్తోం ది. ఈ కారణాలతో విద్యార్థుల దరఖాస్తులు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.


డిమాండ్‌ ఉన్న కోర్సులేవీ?

ప్రస్తుతం డిగ్రీలో బీసీఏ కోర్సుకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఆ కోర్సు చదివితే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లవచ్చని విద్యార్థులు ఎంచుకుంటున్నారు. గతేడాది వరకూ బీసీఏ, బీబీఏ, బీఎంఎస్‌ కోర్సులకు రాష్ట్రంలోనే అనుమతులు వచ్చేవి. ఈ ఏడాది నుంచి ఆ 3 కోర్సులకు మాత్రం ఏఐసీటీఈ అనుమతులు జారీచే స్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే అనుమతు లు ఇవ్వాలని కాలేజీలు కోర్టుకి వెళ్లాయి. దీంతో చాలా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు రాలేదు. మరోవైపు ఏఐసీటీఈ ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు పొడిగించగా.. కోర్టుకు వెళ్లిన కాలేజీల యాజమాన్యాలు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా యి. 15 తర్వాతనే అనుమతులు వస్తాయి. కా నీ షెడ్యూలు ప్రకారం 15వ తేదీలోగా విద్యార్థు లు తమకు ఏ సీటు, ఏ కాలేజీలో కావాలనే ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. దీంతో బీసీఏ, బీబీఏ, బీఎంఎ్‌సలోనే సీట్లు కావాలంటే రెండో విడత కౌన్సెలింగ్‌ వరకూ ఆగాల్సిందే. పాత అధికారులతోనే ఉన్నత విద్యామండలి కొనసాగుతున్నందున ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే వాదన వినిపిస్తోంది.

ఇంజనీరింగ్‌ అంతా సీఎ్‌సఈనే

  • ఆ బ్రాంచ్‌కే భారీగా సీట్ల కేటాయింపు

  • 1.81 లక్షల సీట్లకు 99,494 అవే

ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌కు డి మాండ్‌ పెరిగింది. ఇంజనీరింగ్‌ అంటే సీఎ్‌సఈనే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ ఏడాది కోర్సులకు కేటాయించే సీట్ల పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేయడంతో సీఎ్‌సఈ సీట్లు పెరిగిపోయాయి. గతేడాది వరకూ ఒక కాలేజీలో ఒక కోర్సుకు 240 దాటి సీట్లు కేటాయించాలంటే ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ తప్పనిసరి నిబంధన ఉండేది. ఈ ఏడాది ఆ పరిమితిని తొలగించడంతో కాలేజీలన్నీ సీఎ్‌సఈ సీట్లు భారీగా పెంచుకున్నాయి. ఈ ఏడాది రాష్ర్టానికి మొత్తంగా 1.81 లక్షల ఇం జనీరింగ్‌ సీట్లను మంజూరు చేయగా, వాటి లో 99,494 సీట్లు ఒక్క సీఎ్‌సఈ బ్రాంచ్‌లో నే ఉన్నాయి. కాగా ఏఐసీటీఈ మంజూరు చేసిన సీట్లకు అనుగుణంగా వర్సిటీ, ప్రైవేటు కాలేజీలకు సీట్లు భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ ఉన్నతవిద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరులోని ఓ కాలే జీ సీఎ్‌సఈ జనరల్‌లో 960 సీట్లు సాధించింది. మళ్లీ సీఎ్‌సఈ-ఏఐలో 180 సీట్లు, సీఎ్‌సఈ-ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌లో 180 సీట్లు ఆ కాలేజీకి కేటాయించారు. చిత్తూరులో ఓ కాలేజీకి సీఎ్‌సఈలో 540 సీట్లు, సీఎ్‌సఈ-ఏ ఐ, డేటా సైన్స్‌కు 300 సీట్లు, సీఎ్‌సఈ-క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు 120 సీట్లు, సీఎ్‌సఈ-ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌లో 360 సీట్లు వచ్చాయి.


కనిష్ఠ ఫీజు 40 వేలు

  • ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు

ఇంజనీరింగ్‌ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫీజులను ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సులకు కనిష్ఠ ఫీజు రూ.40 వేలు గా నిర్ణయించింది. గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలు. 2023-26 కాలానికి 210 ఇంజనీరిం గ్‌ కాలేజీలు, బీఆర్క్‌(ఆర్కిటెక్చర్‌) కోర్సులు అందిస్తున్న 2 కాలేజీలకు ఫీజులు ప్రకటించింది. 210 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సగానికి పైగా అంటే... 108 కాలేజీల్లో ఫీజులు కనిష్ఠ స్థాయిలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. మరో 25 కాలేజీల్లో రూ.40 వేల-రూ.50 వేల వరకు ఉన్నాయి. బీఆర్క్‌ కోర్సులు అందిస్తున్న 2 కాలేజీల్లో ఫీజులు రూ.35 వేలుగా నిర్ణయించారు. 2023లో ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ సి ఫారసు చేసిన ఫీజులనే ప్రభుత్వం ఆమోదించి, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, కొత్త ఫీజులపై ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. కనిష్ఠ ఫీజు రూ.40 వేలే ఉందని, ఇది ఇబ్బందిగా ఉందని అంటున్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 04:26 AM