డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పొన్నారావు
ABN , Publish Date - Aug 20 , 2024 | 06:41 AM
రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ)గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. డీఎ్‌సజీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ)గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. డీఎ్‌సజీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి షేర్‌సింగ్ డాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
మూడేళ్లపాటు ఆయన ఈ పోస్టులో కొనసాగనున్నారు. గతంలో డీఎ్‌సజీగా వ్యవహరించిన ఎన్.హరినాథ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో పోస్టు ఖాళీ అయ్యింది. కాగా, సోమవారం సాయంత్రమే హైకోర్టులోని చాంబర్‌లో పొన్నారావు డీఎ్‌సజీగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు సతీసమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
పొన్నారావుది తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, వీఎం పల్లి గ్రామం. తల్లిదండ్రులు పసల మహాలక్ష్మమమ్మ, మోహనరావు. 2005లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. కాగా, దళిత సామాజిక వర్గానికిచెదిన వ్యక్తి డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా నియమితులు కావడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం!.