Share News

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:43 AM

ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

  • గ్రామసభలపై అధికారులకు దిశానిర్దేశం?

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏయే రకాల పనులు చేపట్టాలన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు(ఈ నెల 23న) ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.


ఆ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి సమాచారమిచ్చారు. దానికి సంబంధించి దిశా నిర్దేశం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీ, డీఎల్‌డీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీడీవోలు, ఈఓ పీఆర్‌ అండ్‌ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి పథకం ఏపీవోలు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. డ్వామా పీడీలు జిల్లా స్థాయిలో, ఎంపీడీవోలు మండలస్థాయిలో అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ సూచించారు.

Updated Date - Aug 19 , 2024 | 04:43 AM