Amaravati Farmers: దుర్గమ్మ ఆగ్రహంతో వైసీపీకి అధికారం దూరం..!!
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:56 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాజధాని రైతుల చిరకాల కోరిక నెరవేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొక్కులను తీర్చుకుంటామని రైతులు ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం రాజధాని రైతులు కాలినడకన విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తలపై తీసుకొచ్చిన చక్కరి పొంగళ్లతో ఇంద్రకీలాద్రి అమ్మవారి మొక్కులను చెల్లించుకున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాజధాని రైతుల (Amaravati Farmers) చిరకాల కోరిక నెరవేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొక్కులను తీర్చుకుంటామని రైతులు ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం రాజధాని రైతులు కాలినడకన విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తలపై తీసుకొచ్చిన చక్కరి పొంగళ్లతో ఇంద్రకీలాద్రి అమ్మవారి మొక్కులను చెల్లించుకున్నారు. రాష్ట్రంలో రాక్షసుడి రాక్షస పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడుపై దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అభిప్రాయ పడ్డారు.
‘గత ప్రభుత్వ అధికారంలో ఉండగా దుర్గమ్మ మొక్కలు తీర్చుకునేందుకు రానివ్వలేదు. అమ్మవారిని మొక్కుదామని వస్తే అవాంతరాలు కలిగించారు. మహిళలని చూడకుండా మా రక్తాన్ని చిందించారు. మా ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి నామరూపాలు లేకుండా పోయారు. అందుకే భారీ తేడాతో ఓడిపోయాడు. ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాం. రాష్ట్రంలో వైసీపీ గల్లంతు కావాలని అమ్మవారిని కోరాం. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలనే మా కోరికను అమ్మవారు నెరవేర్చారు. అందుకే అమ్మవారికి మొక్కుబడులను చెల్లించుకున్నాం అని’ రాజధాని రైతులు స్పష్టం చేశారు.