Share News

GRIEVANCE : 295 ఫిర్యాదులు

ABN , Publish Date - Oct 28 , 2024 | 11:58 PM

కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం జిల్లా స్థాయి గ్రీవెన్స కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గుంతకల్‌లో రెవెన్యూ స్థాయి గ్రీవెన్సకు కలెక్టరు, జేసీతో పాటు ఇతర అన్నిశాఖల ఉన్నతాధికారులు వెళ్లగా, జిల్లాస్థాయి గ్రీవెన్స కు ఆయా శాఖల ద్వితీయస్థాయి అధికారులు హాజరయ్యారు.

GRIEVANCE : 295 ఫిర్యాదులు
DRO Malola receiving complaints from people at the Collectorate

అనంతపురం టౌన, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం జిల్లా స్థాయి గ్రీవెన్స కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గుంతకల్‌లో రెవెన్యూ స్థాయి గ్రీవెన్సకు కలెక్టరు, జేసీతో పాటు ఇతర అన్నిశాఖల ఉన్నతాధికారులు వెళ్లగా, జిల్లాస్థాయి గ్రీవెన్స కు ఆయా శాఖల ద్వితీయస్థాయి అధికారులు హాజరయ్యారు. నూతన డీఆర్‌ఓ మలోల ఆధర్యం లో గ్రీవెన్సకు వచ్చిన అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. మొత్తం 295 ఫిర్యాదులు వచ్చినట్లు డీఆర్‌ఓ తెలిపారు. కలెక్టరును, జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను వి న్నవించుకోవాలని జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లా స్థాయి గ్రీవెన్సలో ఉన్నతాధికారులు లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురై తమ అర్జీలను డీఆర్‌ఓకు అందజేసి వెళ్తున్నట్లు కనిపించింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2024 | 11:58 PM