Share News

GOD : శ్రీవారి సేవలో ఒకరోజు

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:51 AM

సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్‌లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు.

GOD : శ్రీవారి సేవలో ఒకరోజు
The scene of Garudavahanaseva to Srinivasa

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 14 : సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్‌లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి కల్యాణోత్సవంను కనులపండువగా నిర్వహించారు. తదనంతరం శ్రీవారికి గరుడసేవ, చంద్రప్రభ వాహన సేవ, పవలింపు సేవ నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు. హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ ఉమాదేవి, విద్యానృసింహభారతి స్వామి, జిల్లా న్యాయాధి కారి శ్రీనివాసులు, అడిషనల్‌ కోర్టు న్యాయాధికారి శోభారాణి హాజరై స్వామిని దర్శించుకున్నారు. అనంతపురంతోపాటు ఇతర జిల్లాలనుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో తదలివచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 15 , 2024 | 12:51 AM