CHRISTMAS: ఘనంగా ఐక్య క్రిస్మస్
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:09 AM
సాయినగర్‌లోని అంబేడ్కర్ భవనలో బుధవారం సాయంత్రం ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐక్య క్రిస్మస్ వేడుకల చైర్మన వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్య క్రమంలో తొలుత కోయర్ బృందాలు క్రీస్తు భక్తి గీతా లాపనలతో అలరించారు. అనంతరం అంతర్జాతీయ దైవ ప్రసంగీకుడు రెవరెండ్ గాడ్లి హాజరై ఆధ్యాత్మిక సందేశమిచ్చారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : సాయినగర్‌లోని అంబేడ్కర్ భవనలో బుధవారం సాయంత్రం ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐక్య క్రిస్మస్ వేడుకల చైర్మన వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్య క్రమంలో తొలుత కోయర్ బృందాలు క్రీస్తు భక్తి గీతా లాపనలతో అలరించారు. అనంతరం అంతర్జాతీయ దైవ ప్రసంగీకుడు రెవరెండ్ గాడ్లి హాజరై ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. అనంతరం రెవరెండ్ మోజస్ అనీల్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా క్రైస్తవులంతా కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ క్యారల్స్ పాడారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ మాజీ మేయర్ మదమంచి స్వరూప, ఏజీసీఈసీ రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ, ఏఐసీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొఠారి విక్టర్ డేనియల్, జిల్లా అధ్యక్షుడు విల్సన, ఐసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు, క్రైస్తవ కమ్యూనిటీ లీడర్ విజయ, పలువురు పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....