Share News

PROTEST : సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:25 AM

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ప్రధాన కార్య దర్శి కుళ్లాయిస్వామి ఆధ్వర్యంలో బుధవారం తరగతులు నడుపుతున్న పులు కార్పొరేట్‌ కళాశాలల వద్దకు వెళ్లి, నిరసన తెలిపారు. తరగతు లను బంద్‌ చేయించారు.

PROTEST : సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలి
AISF leaders protesting

ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల ఆందోళన

అనంతపురం విద్య, అక్టోబరు 3 : సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ప్రధాన కార్య దర్శి కుళ్లాయిస్వామి ఆధ్వర్యంలో బుధవారం తరగతులు నడుపుతున్న పులు కార్పొరేట్‌ కళాశాలల వద్దకు వెళ్లి, నిరసన తెలిపారు. తరగతు లను బంద్‌ చేయించారు. తర్వాత వారు మాట్లాడుతూ... ఈనెల 13వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారన్నారు. యాజమాన్యాలు సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తు న్నాయన్నారు. ఇప్పటికైనా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేలా ఆర్‌ఐఓ, ఇతర అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వంశీ, మంజునాథ్‌, పవన, కార్తీక్‌, యశ్వంత తదితరులు పాల్గొన్నారు.


ఏడీకి ఏబీవీపీ నాయకుల వినతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు దసరా పండుగ సెలవులు ఇస్తే.... అనంతపురంలో కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహించడం తగదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ఏడీని కోరారు. వారు బుధవారం ఏడీ క్రిష్ణయ్యను కలిశారు. ఆ సంఘం విభాగ్‌ కన్వీనర్‌ అఖిల్‌ కుమార్‌రెడ్డి మా ట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఏడీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ కమల్‌, భూతరాజు, సుధీర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 04 , 2024 | 12:25 AM