Counseling : టీచర్లకు సర్దుబాటు కౌన్సెలింగ్
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:56 PM
డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్ టీచర్ స్థానానికి ...
అనంతపురం విద్య, ఆగస్టు 29: డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్ టీచర్ స్థానానికి
కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా ఎస్టీయూ నాయకులు అడ్డుకున్నారు. భాగ్యశ్రీ అనే టీచర్‌ను అనంతపురం మున్సిపాలిటీ నుంచి తాడిపత్రి మున్సిపాలిటీకి సర్దుబాటు చేయగా.. ఆ సంఘం నాయకులు అడ్డుకోవడంతో వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు క్లారిఫికేషన కోసం సమస్యను రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించారు.
బెస్ట్ టీచర్ అవార్డుకు 42 దరఖాస్తులు
అనంతపురం విద్య, ఆగస్టు 29: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 42 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం డివిజనలో ఎస్టీజీ కేటగిరీ నుంచి 7, స్కూల్ అసిస్టెంట్ల నుంచి 7 దరఖాస్తులు వచ్చాయి. కళ్యాణదుర్గం డివిజన నుంచి ఎస్‌జీటీ కేటగిరీ నుంచి రెండు, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ నుంచి 15 దరఖాస్తులు, ప్రధానోపాధ్యాయుల కేటగిరీ నుంచి ఒకటి వచ్చాయి. గుంతకల్లు డివిజన నుంచి ఎస్‌జీటీ కింద 6, స్కూల్ అసిస్టెంట్ కింద 3, ప్రధానోపాధ్యాయుల నుంచి ఒక దరఖాస్తు వచ్చాయి. మూడు డివిజన్ల నుంచి మొత్తం 42 దరఖాస్తులు వచ్చాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....