Share News

Agros : అంపశయ్యపై ఆగ్రోస్‌..?

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:10 AM

రైతులకు మెరుగైన సేవలు అందించిన ఏపీ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రోస్‌) నిర్వహణ అంపశయ్య మీదకు చేరినట్లు అగుపిస్తోంది. గత వైసీపీ పాలనలో సంస్థ నిర్వహణ చాలా అధ్వానంగా మారింది. 1968 సంవత్సరంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో ఏపీ ఆగ్రోస్‌ రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్లల్లో పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లను రైతులకు అద్దెకు ఇచ్చేవారు. తద్వారా పొలాల్లో పలు రకాల పనులు చేయించేవారు. పొలాలను...

 Agros : అంపశయ్యపై ఆగ్రోస్‌..?
Agros, which has closed down, was an exhibition center for modern machinery

గతంలో రైతులకు మెరుగైన సేవలు

వైసీపీ పాలనలో అధ్వాన పరిస్థితి

నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం

గతంలోలా పనులు అప్పగిస్తే పూర్వవైభవం

కూటమి ప్రభుత్వం చొరవపై గంపెడాశలు

అనంతపురం అర్బన, సెప్టెంబరు 15: రైతులకు మెరుగైన సేవలు అందించిన ఏపీ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రోస్‌) నిర్వహణ అంపశయ్య మీదకు చేరినట్లు అగుపిస్తోంది. గత వైసీపీ పాలనలో సంస్థ నిర్వహణ చాలా అధ్వానంగా మారింది. 1968 సంవత్సరంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో ఏపీ ఆగ్రోస్‌ రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్లల్లో పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లను రైతులకు అద్దెకు ఇచ్చేవారు. తద్వారా పొలాల్లో పలు రకాల పనులు చేయించేవారు. పొలాలను చదును చేసేందుకు, ఇతరత్రా పనులు చేయడం ద్వారా రైతులకు చేయూతనిచ్చారు. ఆ తర్వాత 1975 సంవత్సరం నుంచి ఆగ్రోస్‌ సంస్థ ద్వారా రైతుల పొలాల్లో బోరుబావులు తవ్వించారు. 2020 దాకా బుర్డోజర్లను అద్దెకు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత బుల్డోజర్లు కాలం చెల్లడంతోపాటు రైతులకు అందుబాటులోకి పెద్ద యంత్రాలు రావడంతో ఆగ్రో్‌సకు చెందిన బుల్డోజర్లకు ప్రాముఖ్యం తగ్గిపోయింది.


గతంలో మెరుగైన సేవలు

అనంతపురం ఆగ్రోస్‌ రీజినల్‌ కార్యాలయం పరిధిలోని ఉమ్మడి అనంత జిల్లాతోపాటు కర్నూలు రైతులకు సంస్థ ద్వారా గతంలో మెరుగైన సేవలు అందించారు. 2005 నుంచి 2012 దాకా జిల్లాలోని అన్ని మండలాల్లో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సబ్సిడీతో యంత్రీకరణ పరికరాలు, వ్యవసాయ పనిముట్లను ఆగ్రోస్‌ ద్వారా రైతులకు పంపిణీ చేసేవారు. అలాగే పలు రకాల యాంత్రీకరణ పరికరాలను రైతులకు అద్దెకు ఇచ్చి పొలాల్లో పనులు చేసేందుకు దోహదపడ్డారు. అప్పట్లో ఆయా సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు, క్రిమి సంహారక మందులు పంపిణీ చేసేవారు. 2017లో రైతులకు రెయినగన్సను కూడా విక్రయించారు.

మూతపడిన యాంత్రీకరణ కేంద్రం

అనంతపురం ఆగ్రోస్‌ సంస్థ పరిధిలో 2017 సంవత్సరంలో ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం లో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రదర్శించి అవగాహన కల్పించేవారు. అలాగే ఆధునిక యంత్ర పరికరాలను అద్దె ప్రతిపాదికన రైతులకు అందించేవారు. తద్వారా రైతులు తమ పొలాల్లో అవసరమైన పనులు చేసుకునేవారు. గత ఐదేళ్లుగా యాంత్రీకరణ ప్రదర్శన కేంద్రం మూతపడింది. దీంతో రైతులకు ఆధునిక యంత్ర పరికరాలపై అవగాహన కల్పించేవారే లేరు.

ఖాళీగా ఉద్యోగులు, సిబ్బంది..!

అనంతపురం ఆగ్రోస్‌ కార్యాలయంలో ప్రస్తుతం ఇనచార్జ్‌ ఆర్‌ఎం బీవీ కృష్ణారెడ్డితోపాటు 9 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో నలుగురు రెగ్యులర్‌ డ్రైవర్లు, మిగతా సిబ్బంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో ఎలాంటి పనులు లేకపోవ డంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఆగ్రోస్‌ సంస్థ ద్వారా గతంలో చేసిన పలు రకాల పనులు మళ్లీ అప్పగిస్తే తాము చేసేందుకు పని ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్ల కిందట జిల్లాలో పదుల సంఖ్యలో కార్యాలయ అధికారులు, ఉద్యోగులతో పాటు ఫీల్డ్‌ సిబ్బంది పనిచేసేవారు. ఆగ్రోస్‌ ద్వారా అందించే సేవలు క్రమంగా తగ్గిపోయాయి. ఉన్న అధికారులు సైతం ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం గుంటూరు ఆగ్రోస్‌ హెడ్‌ ఆఫీ్‌సలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బీవీ కృష్ణారెడ్డి అనంతపురం, చిత్తూరు రీజియన్లకు ఇనచార్జి ఆర్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సంస్థలో అధికారులు కొరత తీవ్రంగా ఉందనేందుకు ఇదే నిదర్శనం.

అనంతలో రూ.కోట్ల విలువైన భూమి

ఏపీ ఆగ్రో్‌సకు జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువైన భూమి ఉంది. అనంతపురం నగరం బళ్లారి రోడ్డులో 2.80 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ ఆగ్రోస్‌ సంస్థ కార్యాలయం ఉంది. ఇందులో 90 సెంట్లను బొరుగుల ఫ్యాక్టరీకి లీజుకు ఇచ్చారు. క్లాక్‌ టవర్‌ వద్ద మూడు షాపులను అద్దెకు ఇచ్చారు. ఏపీ ఆగ్రోస్‌ సంస్థ రాష్ట్ర శాఖలో రూ.100 కోట్ల డిపాజిట్‌ ఉన్నట్లు సమాచారం. సంస్థలో డబ్బులకు కొదవలేదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి అనంత జిల్లా తరపున వైసీపీ నాయకుడు నవీననిశ్చల్‌ను ఏపీ ఆగ్రోస్‌ చైర్మనగా నియ మించారు. అయినప్పటికీ ఏపీ ఆగ్రోస్‌ సంస్థ పురోభివృద్ధికి ఆయన ఎలాంటి ప్రత్యేక చొరవ తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైర్మన హోదాలో ఆగ్రోస్‌ కు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో ఆగ్రోస్‌ సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఆ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రోస్‌ సంస్థపై ప్రత్యేక దృష్టి సారించి, సంస్థకు కావాల్సిన అధికారులు, నైపు ణ్యం కలిగిన ఇంజనీర్లను నియమించి, గతంలో చేపట్టిన పలు రకాల పనులు సంస్థ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే సంస్థ మూత పడటం ఖాయమన్న వాదనలు ఆసంస్థ అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితేనే భవిష్యత్తు

గత కొన్నేళ్లుగా ఏపీ ఆగ్రోస్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. సంస్థలో పనిచేసే అధికారులు ఒక్కొక్కరుగా ఉద్యోగ విరమణ పొందుతూ వచ్చారు. ఇదే క్రమంలో సంస్థ ద్వారా అందించే పలు రకాల సేవలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల పనులు స్తంభించి పోయాయి. జిల్లా కేంద్రంలో సంస్థకు రూ.కోట్ల విలువ చేసే భూమి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సంస్థకు పూర్వవైభవం తీసుకువచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలో మాదిరే సంస్థ ద్వారా రైతులకు సబ్సిడీతో యాంత్రీకరణ పరికరాలు సరఫరా చేసేలా నిర్ణయం తీసుకోవాలి. రైతులకు అవసరమైన మరిన్ని సేవలు సంస్థ ద్వారా చేపడితే రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు సంస్థ బతికిబట్టకడుతుంది.

-బీవీ కృష్ణారెడ్డి, అనంతపురం ఏపీ ఆగ్రోస్‌ ఇనచార్జ్‌ ఆర్‌ఎం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 16 , 2024 | 12:10 AM