Share News

MLA MS RAJU : మడకశిర డిపోకు 30 బస్సులు కేటాయించండి

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:30 AM

స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి సహకారం అందించాలని, 30 నూతన బస్సులు కేటాయించాలని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు కోరారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో గురువారం మంత్రిని కలిసి మడకశిర నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 2009 వ సంవత్సరంలో మడకశిర డిపోను ఏర్పాటు చేశారని, నేటికీ ఈప్రాంత అవసరాలకు త గ్గట్టుగా బస్సులను నడపడం లేదన్నారు.

MLA MS RAJU : మడకశిర డిపోకు 30 బస్సులు కేటాయించండి
MLA MS Raju presenting the petition to Transport Minister Ram Prasad Reddy

మడకశిర డిపోకు 30 బస్సులు కేటాయించండి

మడకశిరటౌన, ఆగస్టు 29 : స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి సహకారం అందించాలని, 30 నూతన బస్సులు కేటాయించాలని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు కోరారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో గురువారం మంత్రిని కలిసి మడకశిర నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 2009 వ సంవత్సరంలో మడకశిర డిపోను ఏర్పాటు చేశారని, నేటికీ ఈప్రాంత అవసరాలకు త గ్గట్టుగా బస్సులను నడపడం లేదన్నారు.


తద్వారా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, రవాణా సౌలభ్యంతో పాటు డిపోకు ఆదాయం చేకూ రాలంటే 30 నూతన బస్సులను మంజూరు చేయాలని కోరారు. డిపోలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరామన్నారు. అనంతరం రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి జిల్లా వ్యాప్తంగా 32 తహసీల్దార్‌ పోస్టులకుగాను 17 మంది మాత్రమే విధులు నిర్వహిస్తు న్నారని తెలిపారు. దీంతో పాలనా పరంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే అంశంలోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని అధిగమించాలంటే మడకశిర నియోజకవర్గంతోపాటు జిల్లాలో ఖాళీగా ఉన్న తహసీల్దార్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అందుకు ప్రత్యేక చొరవ చూపాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం పలు సమస్యలపై చర్చించామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 30 , 2024 | 12:30 AM