Share News

RALLY: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:09 AM

రాజ్యసభలో అంబేడ్కర్‌ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

RALLY: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి
Members of the Bahujana Chaitanya Vedika formed in Penukonda

పెనుకొండ/హిందూపురం అర్బన, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో అంబేడ్కర్‌ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో అంబేడ్కర్‌కు పూలమాలలువేసి నివాళులు అర్పించి మానవహారంగా ఏర్పడ్డారు. ఆయన మాట్లాడుతూ హోంమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ కమిటీ సభ్యుడు గంగాధర్‌, చైతన్యవేదిక గౌరవాధ్యక్షుడు రొద్దం బాబు ప్రసాద్‌, రాము, రవిప్రసాద్‌, రామాంజినప్ప, నరసింహులు, కొల్లప్ప, హంటర్‌ ప్రసాద్‌, మారుతి, ఎంఎన మూర్తి పాల్గొన్నారు.

ఫ అంబేడ్కర్‌ను అవమానించే విధంగా కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో అనుచిత వాఖ్యలు చేయడం దారుణమని వివిధ పార్టీల నాయకులు మండిపడ్డారు. మంత్రి అమితషా మాట్లాడే విధానం యావత భారతీయులను కలిచివేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక రూపాల్లో దాడులు జరుగుతూనే ఉ న్నాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మమనే ఒక రాజ్యాంగాన్ని తీ సుకురావాలని అమితషా కుట్ర చేస్తున్నారన్నారు. మంత్రి తన పదవికి రా జీనామా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంఎ్‌సఎఫ్‌ రవి, ఆర్‌ఎ్‌సపీ శ్రీనివాసులు, ఏపీఆర్‌ఎస్‌ నౌషాద్‌, కాంగ్రెస్‌ నాయకులు షాహిద్‌, కలీం, హనుమంతరాయుడు, జియా, అంజి పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:09 AM