Share News

Anantapuram: బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

ABN , Publish Date - Dec 08 , 2024 | 07:34 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్‌ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్‌ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.

Anantapuram: బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

అనంతపురం: వైసీపీ నేత (YSRCP leader), రౌడీషీటర్‌ (Rowdy Sheeter ) బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil) ను న్యాయస్థానం అనుమతితో అనంతపురం (Anantapuram) పోలీసులు (Police) కస్టడీ (Custody)కి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోర్త్ టౌన్ పోలీసులు అనంతపురం తీసుకువచ్చారు. నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడటంపై తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనిల్‌ను మూడు రోజులు పాటు అనంతపురం పోలీసుల కస్టడీకి అనుమతించింది. కోర్టు అనుమతి మేరకు వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను ఫోర్త్ టౌన్ పోలీసులు విచారించనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్‌ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్‌ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి అనంతపురం తీసుకువెళ్లేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఎస్కార్ట్‌ వాహనంలో రోడ్డుమార్గం గుండా అనంతపురానికి తరలించారు. మూడు రోజులు పాటు బోరుగడ్డ అనిల్‌ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది.


గుంటూరులో అనిల్‌పై హత్యాయత్నం కేసు..

మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2 ఉన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్‌తో సహా 25 మందిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌పై కేసు నమోదు చేశారు. కస్టడీకి తీసుకుని, వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌ ఆస్పత్రికి అనిల్‌‌ను తరలించారు. అరండల్ పేట పోలీసులు మూడురోజుల పాటు అనిల్‌ను ప్రశ్నించారు. వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది.

ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్..

కాగా.. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్‌ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్‌ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి వారు వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని అనిల్‌ కుమార్ పోలీసుల విచారణలో తెలిపారు. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్‌ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..

నడ్డా.. అడ్డగోలు మాటలొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 08 , 2024 | 07:34 AM