ANGANWADI : అంగనవాడీ కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు
ABN , Publish Date - Sep 17 , 2024 | 12:00 AM
మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు.
తొలగించాలంటున్న తల్లిదండ్రులు
శింగనమల, సెప్టెంబరు 16: మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు. ఇటీవ ల కురిసిన వర్షాలకు భవనం చుట్టూ గడ్డి, పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో అక్కడ పాములు తదితర విషపురుగులు ఎక్కువగా సంచరిస్తున్నాయని పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి వెంటనే అంగనవాడీ కేంద్రం చుట్టూ గడ్డి, కంప చెట్లు తొలగించాలని వారు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....