Share News

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:07 AM

గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్‌ విభాగంలో అవినీతి బురద డీఆర్‌ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..

CBI : ఇంకొక్కటి అడిగి.. దొరికారు..!
Accused and CBI officials in Kurnool court premises

ఎప్పుడూ ఒకశాతం తీసుకునేవారు..

ఈసారి రెండు శాతం కావాలన్నారట..

సీబీఐ వలలో పడ్డ అవినీతి చేపల కథ ఇది

డీఆర్‌ఎం సహా ఐదురుగు రైల్వే అధికారుల అరెస్టు

లంచం ఇచ్చినందుకు ఇద్దరు కాంట్రాక్టర్లపైనా కేసు

గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్‌ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్‌ విభాగంలో అవినీతి బురద డీఆర్‌ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో


జరిగాయి. డీఆర్‌ఎం వినీత సింగ్‌, బదిలీపై వెళ్లిన సీనియర్‌ డీఈఎన (కో-ఆర్డినేషన) యు.అక్కిరెడ్డి, సీనియర్‌ డీఎ్‌ఫఎం కె.ప్రదీప్‌ బాబు, అకౌంట్సు విభాగం సూపరింటెండెంటు బాలాజీ, గతిశక్తి చీఫ్‌ ప్రాజెక్టు మేనేజరు కార్యాలయ అకౌంట్సు అసిస్టెంటు డి.లక్ష్మీపతిరాజును సీబీఐ అరెస్టు చేసింది. వారిని కర్నూలు సీబీఐ కోర్టులో హాజరుపరచగా.. న్యాయాధికారి 14 రోజుల రిమాండ్‌ విధించారు. వీరితోపాటు లంచం ఇచ్చినందుకు ఇద్దరు కాంట్రాక్టర్లనూ సీబీఐ మూసేసింది. అందరూ కర్నూలు జిల్లా జైలుకు శనివారం రాత్రికి చేరుకున్నారు. సీబీఐ దాడులు రైల్వే డివిజనలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తామెక్కడ దొరికిపోతామోనని అక్రమార్కులు హడలిపోతున్నారు. మూడు రోజులుగా డీఆర్‌ఎం కార్యాలయంలో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఇలా మొదలైంది..

గుంతకల్లు రైల్వే డివిజనకు కేంద్రం ప్రభుత్వం నుంచి గతిశక్తి ప్రాజెక్టు కింద భారీగా నిధులు విడుదలయ్యాయి. సేఫ్టీ కేటగిరిలో వచ్చిన ఈ నిధులతో వంతెనలను నిర్మించాల్సి ఉంది. పీలేరుకు చెందిన సత్యనారాయణ అనే ప్రధాన కాంట్రాక్టరుకు రూ.50 కోట్ల విలువైన బ్రిడ్జి వర్కులు దక్కాయి. ఆయన వంతెన పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. పనులను ప్రాంభించడానికిగానూ ఆక్సెప్టెన్సీ లెటరు కోసం సబ్‌ కాంట్రాక్టర్లు రమేశ రెడ్డి, రహ్మతుల్లా అకౌంట్సు కార్యాలయం చుట్టూతిరిగారు. సీనియర్‌ డీఎ్‌ఫఎం ప్రదీప్‌ బాబుకు కొత మొత్తం లంచంగా ఇచ్చారు. అయినా పనిచేయకుండా.. పెద్ద మొత్తంలో డిమాండు చేశారు. దీంతో సబ్‌ కాంట్రాక్టర్లు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. దీంతో సీబీఐ అధికారులు గుంతకల్లుకు వచ్చి.. నిఘా వేశారు. సీబీఐ డీఎస్పీ జైకుమార్‌ భారతీయ, ఆయన సిబ్బంది అవినీతి అధికారిని పట్టుకోవడానికి పథకం


రచించారు. పథకం ప్రకారం సబ్‌ కాంట్రాక్టర్లు ఇచ్చిన రూ.11 లక్షల లంచం డబ్బులను అకౌంట్సు సిబ్బంది తీసుకున్నారు. సీబీఐ అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ డీఎ్‌ఫఎం ప్రదీప్‌ బాబును పట్టుకున్నారు. ఆ తరువాత వీడియో కాన్ఫరెన్సులో ఉన్న డీఆర్‌ఎం వినీత సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. డీఆర్‌ఎం, సీనియర్‌ డీఎ్‌ఫఎం ఇళ్లల్లో సోదా చేశారు. భారీగా బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన సీనియర్‌ డీఈఎన (కో-ఆర్డినేషన) యు.అక్కిరెడ్డికి కూడా ఈ అవినీతిలో భాగం ఉందని నిర్ధారించుకుని, అతడిని సికింద్రాబాదు నుంచి రప్పించి అరెస్టు చేశారు. వారిపై అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం 61(2)-బీఎనఎ్‌స, 7, 8, 9, 10, 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో లంచం ఇచ్చిన ఇద్దరు సబ్‌ కాంట్రాక్టర్లపై కూడా కేసులు పెట్టారు. వీరందరికీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం వైద్య పరీక్షలను నిర్వహించి, కర్నూలులోని సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచారు.

వైసీపీ భక్తులు..

నెల కిందటి వరకూ గుంతకల్లు డివిజనల్‌ డీఈఎన (కో-ఆర్డినేషన) హోదాలో పనిచేసిన అక్కిరెడ్డికి, సీనియర్‌ డీఎ్‌ఫఎం ప్రదీప్‌ బాబుకు వైసీపీ అంటే వల్లమాలిన అభిమానం. ఈ అవ్యాజమైన ప్రేమతో పలువురు కాంట్రాక్టర్లకు దక్కాల్సిన పనులను వైసీపీ అనుకూలురైన కాంట్రాక్టర్లకు వచ్చేలా ఉడత సాయాలు చేసినట్లు సమాచారం. అధికారులమన్న ధ్యాస లేకుండా ఆ పార్టీకి కొమ్ముకాశారన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల సమయంలోనే కాంట్రాక్టర్లు పోటీపడకుండా అడ్డుపడి, అస్మదీయులకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డివిజనలోని పలువురు కాంట్రాక్టర్లకు వారి వ్యవహారం కంటగింపుగా మారినట్లు సమాచారం. ఆ అసంతృప్తే కాంట్రాక్టర్లలో ఇలా బైటపడిందని డీఆర్‌ఎం కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. గుంతకల్లులోని ధర్మవరం గేటు వద్ద ఆర్‌యూబీ వంతెన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మార్చిలో హాజరై.. స్టేజీ ఎక్కి మరీ వైసీపీ భజన చేశారు. వీరిలో ఒకరు ఎన్నికల తర్వాత జగన్మోహన రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి పాసు కూడా


తెప్పించుకున్నట్లు తెలిసింది.

రెండు శాతం డిమాండుతో..

కేంద్ర ప్రభుత్వం రైల్వే పనులకు సంబంధించి ఏ డివిజనకు ఆ డివిజనలో టెండర్లను నిర్వహించనీయకుండా, పలు వర్కులను కలిపి ఒకే పెద్ద వర్కుగా మార్చి అంబ్రెల్లా వర్కుల పేరిట బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. స్థానిక అధికారులకు ఒక శాతానికి మించకుండా మామూళ్లు ఇస్తుంటారు. కానీ కడప వద్ద సబ్‌ కాంట్రాక్టర్లు చేసేందుకు సిద్ధపడిన వంతెనల వర్కులపై 2 శాతం మమూలు ఇవ్వాలని డిమాండు చేశారని సమాచారం. అందుకే వ్యవహారం తెగేదాకా వచ్చిందని అంటున్నారు. రైల్వే డివిజనలోని తిరుపతిలో ఫిబ్రవరిలో ఇద్దరు ఉద్యోగులు సీబీఐ చేతికి చిక్కారు. ఎలెకి్ట్రకల్‌ ఎస్‌ఎ్‌సఈగా పనిచేస్తున్న గంటా రామమోహనరావు, ఏడీఈఈగా పనిచేస్తున్న అప్పలరాజు.. మెసర్స్‌ కోర్‌ ఫోర్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తిరుపతిలోని కోచ వాషింగ్‌ అండ్‌ సిక్‌ మెయింటెనెన్స డిపోలో బోగీలకు 750 ఓల్ట్సు విద్యుత్తు సరఫరా కాంట్రాక్టు విషయంగా లంచం తీసుకుంటూ వారు దొరికారు. అది జరిగి ఆరు నెలలు తిరక్కుండానే డివిజనల్‌ హెడ్‌ క్వార్టర్లులోనే అవినీతి చేపలు సీబీఐ చేతికి చిక్కాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 07 , 2024 | 12:07 AM