Share News

ATTIMPT : ప్రభుత్వ భూమిలో గుడిసెల ఏర్పాటుకు యత్నం

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:00 AM

మండలంలోని అక్కంపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు యత్నించ గా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రాచానపల్లి పొలం సర్వే నెంబరు 160-1లోని 4.02 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దళితుల ముసుగులో గుడిసెలు వేసేందుకు ఆదివారం ప్రయ త్నాలు చేశారు.

ATTIMPT : ప్రభుత్వ భూమిలో గుడిసెల ఏర్పాటుకు యత్నం
People gathered in the land near Akkampally

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

అనంతపురం రూరల్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కంపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు యత్నించ గా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రాచానపల్లి పొలం సర్వే నెంబరు 160-1లోని 4.02 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దళితుల ముసుగులో గుడిసెలు వేసేందుకు ఆదివారం ప్రయ త్నాలు చేశారు. ఈ విషయాన్ని పలువురు తహసీల్దార్‌ మోహనకుమార్‌ దృష్టికెళ్లడంతో ఆయన రెవెన్యూ సిబ్బందిని అక్కడకు పంపించారు. గుడిసెలు వేసే ప్రక్రియను నిలిపి వేయించారు. గతంలో ఇదే విధంగా అప్పటి అధికారులు అడ్డుకుని ప్రభుత్వ స్థలంలో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయించారు. భూమిలోకి ఎవ్వరూ వెళ్లకూడదని ఆదేశించారు. తిరిగి ఆదివారం అదే భూమిలో గుడిసెలు వేసేందుకు ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వినవచ్చాయి. భూమిలోకి వెళ్లకూడదని గతంలోనే చెప్పామని, మళ్లీ అవే ప్రయత్నాలు చేస్తున్నారని తహసీల్దార్‌ మోహనకుమార్‌ అన్నారు. గుడిసెలు వేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని తహసీల్దార్‌ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 04 , 2024 | 12:00 AM