BJP MEMBERSHIP: 18 కోట్ల సభ్యత్వంతో అగ్రగామిగా బీజేపీ
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:50 PM
భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వంతో అగ్రగామి పారీగా నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన భారతీయజనతాపార్టీ ఎస్సీ మోర్చా సత్యసాయిజిల్లా సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ధర్మవరం,అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వంతో అగ్రగామి పారీగా నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన భారతీయజనతాపార్టీ ఎస్సీ మోర్చా సత్యసాయిజిల్లా సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్య, రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం చేపడతామన్నారు. బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు. దేశాభివృద్ధికి మోదీ ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాకే ఓబుళేశు, జింకా చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ గంగులకుంట గోపాల్‌రెడ్డి, భక్తవత్సలం, నబీరసూల్ పాల్గొన్నారు.