PROTEST : కార్మికులకు చీపుర్లూ ఇవ్వలేరా..?
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:03 AM
తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ నగరంలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో శనివారం పాతూరులోని గాంధీబజార్‌లో చెట్ల కొమ్మలతో రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కొమ్మలతో రోడ్లు ఊడ్చి నిరసన
అనంతపురం క్రైం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ నగరంలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో శనివారం పాతూరులోని గాంధీబజార్‌లో చెట్ల కొమ్మలతో రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ... కార్మికులకు పనిముట్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. అధికారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, చేయని పనులకు బిల్లులు చేసుకుంటున్నారని విమర్శించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సమస్యలు పట్టించకోవడం లేదన్నారు. పనిముట్లు ఇవ్వకపోతే కార్మికులు ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. పనిముట్లు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగేంద్రబాబు, తిరుమలయ్య, దేవమ్మ, ఎర్రప్ప, మాధవయ్య, రామాంజి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....