Share News

MILAD - UNA _ NABI : ఘనంగా మిలాద్‌- ఉన- నబీ వేడుకలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:55 PM

నగరంలోని జమాతే ఇస్లామీ హింద్‌ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్‌-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్‌కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు.

MILAD - UNA _ NABI : ఘనంగా మిలాద్‌- ఉన- నబీ వేడుకలు
Muslims holding a rally in Papampet

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు16 : నగరంలోని జమాతే ఇస్లామీ హింద్‌ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్‌-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్‌కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన అధ్యక్షుడు నవాజ్‌, కార్యదర్శి హాజీపీరా, మహిళా సభ్యులు భాను, సల్మా, మనురత తదితరులు పాల్గొన్నారు.

అనంతపురంరూరల్‌: మండలంలో మిలాద్‌-ఉన-నబీ వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. పాపంపేటలో కళ్యాణదుర్గం ప్రధానరోడ్డు వెంట నగరం వరకు ర్యాలీ చేశారు.

శింగనమల: మండలంలోని ముస్లింలు మిలాద్‌ - ఉన - నబీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శింగనమల అసర్‌కట్ట వద్ద నుంచి గం ధోత్సవం చేపట్టారు. ముస్లిం పెద్దలు మాసూద్‌ వలి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 16 , 2024 | 11:55 PM