TDP : కూటమి వందరోజుల పాలనపై సంబరాలు
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:25 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనపై టీడీపీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... గురువారం సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ స్థానిక కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
ఆత్మకూరు సెప్టెంబరు19: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనపై టీడీపీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... గురువారం సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ స్థానిక కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. మండల కన్వీనర్ శ్రీనివాసులు, నాయకులు శశాంక చౌదరి, కుళ్లాయప్ప, ప్రతాప్, మనోరంజన, నాయకులు కందుల ఓబులపతి, సందీప్ చౌదరి, తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన: టీడీపీ ఈడిగ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికీ క్షీరాభిషేకం చేశారు. మద్యం షాపుల్లో ఈడిగలకు 10 శాతం రిజర్వేషన కల్పించిన నేపథ్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాయకులు రాజు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, గంగాధర్, శ్రీరాములు, జయప్రకాష్, చంద్ర, మధు, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....