Share News

DULEEP TROPHY : దులీప్‌ ట్రోఫీలో సెంచరీల మోత

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:40 AM

అనంతపు రం ఆర్డీటీ మైదానాల్లో జరుగుతున్న దులీప్‌ట్రోఫీ క్రికెట్‌ పోటీ లలో మూడో రోజు శనివారం మూడు సెంచరీలు నమోద య్యాయి. ఇం డియా-ఎ జట్టు రెండో ఇన్నింగ్స్‌ వికెట్‌ నష్టా నికి 115 పరు గులతో ఆట ప్రారంభించి.. 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఇండియా- డి జట్టు 488 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ పారంభించి, మూడో రోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 62 పరుగులు చేసింది.

DULEEP TROPHY : దులీప్‌ ట్రోఫీలో సెంచరీల మోత
Fan frenzy at the stadium

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 14: అనంతపు రం ఆర్డీటీ మైదానాల్లో జరుగుతున్న దులీప్‌ట్రోఫీ క్రికెట్‌ పోటీ లలో మూడో రోజు శనివారం మూడు సెంచరీలు నమోద య్యాయి. ఇం డియా-ఎ జట్టు రెండో ఇన్నింగ్స్‌ వికెట్‌ నష్టా నికి 115 పరు గులతో ఆట ప్రారంభించి.. 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఇండియా- డి జట్టు 488 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ పారంభించి, మూడో రోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 62 పరుగులు చేసింది. ఇండియా-ఎ జట్టు బ్యాట్స్‌మన ప్రథమ్‌ సింగ్‌ 189 బంతుల్లో 12 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 122 ప రుగులు సాధించారు. కెప్టెన మయాంక్‌ అగర్వాల్‌ 56 పరు గులు చే శారు. తిలక్‌వర్మ 193 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 111 పరు గులు చేశారు. రియాన పరాగ్‌ 20 పరుగులు, షాషావత రావత 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇండియా-డి బౌలర్లు సౌరభ్‌ కుమార్‌ 2, శ్రేయాస్‌ అయ్యర్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. విజయం కోసం ఇండియా-డి జట్టు మరో 426 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.


సెంచరీతో చెలరేగిన కెప్టెన అభిమన్యు ఈశ్వర్‌

మరో మ్యాచలో ఇండియా-బి కెప్టెన అభిమన్యు ఈశ్వర్‌ సెంచరీతో చెలరేగారు. 143 పరుగుల తో నాటౌట్‌గా నిలిచాడు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 36 ఓవర్లలో వికెట్‌ న ష్టపోకుండా 124 పరు గులతో మూడో రోజు ఆట ను బి జట్టు ఆరంభిం చింది. కెప్టెన అభిమన్యు ఈశ్వర్‌ 262 బంతుల్లో 12 బౌండరీలు, సిక్సర్‌ సాయంతో 143 పరుగులు చేశారు. మరో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ జగదీశన 137 బంతుల్లో 8 బౌం డరీల సాయంతో 70 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. ఆ తరువాత వచ్చిన ముషీర్‌ఖాన (1), సర్ఫ రాజ్‌ఖాన(16), రింకూసింగ్‌ (6), నితీష్‌రెడ్డి (2), వాషింగ్టన సుందర్‌ (13), సాయికిశోర్‌ (21) తక్కువ స్కోర్లకు పరిమితమయ్యారు. మూ డో రోజు ఆట ముగిసే మయానికి ఇండియా-బి జట్టు 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించింది. క్రీజ్‌లో కెప్టెన అభిమన్యు ఈశ్వర్‌ (143), రాహుల్‌ చాహార్‌ (18) ఉన్నారు. ఇండియా-సి బౌలర్లు అన్షుల్‌ కాంబోజ్‌ 5 వికెట్లు, విజయ్‌కుమార్‌ వైశాక్‌, మయాంక్‌ మా ర్కండే చెరో వికెట్‌ తీశారు. సి జట్టు మొదటి ఇన్నింగ్స్‌ 525 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు కూడా బి జట్టు మొదటి ఇన్నింగ్స్‌ ఉన్నందున, మ్యాచ డ్రా అయ్యే అవకాశం కనిపిస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 15 , 2024 | 12:40 AM