Share News

EX MLA VIKUNTAM : విజన ఉన్న నాయకుడు చంద్రబాబు

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:28 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన ఉన్న నాయకుడు.... సాంకేతికను ఎలా ఉపయోగిం చుకోవాలో అయనకు బాగా తెలుసు... అందుకే పొలాల్లో మందులు పిచికారి చేసే డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వై కుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు.

EX MLA VIKUNTAM : విజన ఉన్న నాయకుడు చంద్రబాబు
Soon we will complete 10 thousand houses

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుఠం ప్రభాకర్‌ చౌదరి

శింగనమల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన ఉన్న నాయకుడు.... సాంకేతికను ఎలా ఉపయోగిం చుకోవాలో అయనకు బాగా తెలుసు... అందుకే పొలాల్లో మందులు పిచికారి చేసే డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వై కుంఠం ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. డ్రోన్స ద్యారా పంటలకు మందులు పిచికారి చేసే విధానంపై మండలం లోని పెరవలి గ్రామంలో వియోమిక్స్‌ కంపెనీ ప్రతినిధులు మంగళవారం రైతుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, టీడీపీ నాయకులు మారుతి నాయుడు, చిదానందనాయుడు, పుచ్చకాయ రాము ఆధ్యర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ప్రభాకర్‌ చౌదరి మా ట్లాడుతూ పొలాల్లో డ్రోన్లను ఉపయోగించడం ద్యారా సమయంతో పాటు ఖర్చు లు, పురుగు మందులు ఆదా అవుతాయన్నారు. కంపెనీ ప్రతినిధులు దాదాపు వేయి మంది యవకులకు 15 రోజుల పాటు డ్రోన్ల ఆపరేషనపై శిక్షణ ఇవ్వను న్నట్లు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఈ కార్యకర్రమంలో సర్పంచ రాజు, సాధిక్‌ నాగరాజు దేవళ మురళి శంకర్‌నాయుడు, కంపెనీ ప్రతినిధి హనుమాన, టెక్నీషియన వంశి, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 27 , 2024 | 12:28 AM