Share News

ROAD : దుమ్ము, ధూళికి చెక్‌..!

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:34 AM

రుద్రంపేట ప్రధాన రహదారిపై ప్రయాణమంటే ప్రజలు హడలిపోయేవారు. రోడ్డు చాలా అధ్వా నంగా ఉండేది. గుంతలతో పాటు రోడ్డు పై రేగే దుమ్ము..ధూళితో స్థానికులు, వా హనదారుల అవస్థలు వర్ణనాతీతం.

ROAD : దుమ్ము, ధూళికి చెక్‌..!
Road construction works going on near Chandrababu Kottala

ప్రయాణ కష్టాల నుంచి విముక్తి

జోరుగా రుద్రంపేట-ఆలమూరు రోడ్డు నిర్మాణం పనులు

అనంతపురం రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రుద్రంపేట ప్రధాన రహదారిపై ప్రయాణమంటే ప్రజలు హడలిపోయేవారు. రోడ్డు చాలా అధ్వా నంగా ఉండేది. గుంతలతో పాటు రోడ్డు పై రేగే దుమ్ము..ధూళితో స్థానికులు, వా హనదారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షం కాలంలో మరింత ఇబ్బందులు పడేవా రు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై, జోరు గా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో స్థానికులకు, వాహనదారులకు దుమ్ము ధూళి నుంచి విముక్తి కలుగనుంది.

తీరనున్న ప్రయాణ కష్టాలు

మూడేళ్ల కిందట అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రుద్రంపేట సర్కిల్‌ నుంచి పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశా ల వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఆది నుంచి నత్తనడక సాగుతూ వచ్చాయి. రుద్రం పేట స ర్కిల్‌ నుంచి రెండు వందల మీటర్ల రోడ్డు దాదాపు 80 శాతం పూర్తయింది. అక్కడి నుంచి పీవీకేకే కళాశాల వరకు పనులు నత్తనడకన సాగాయి. ఏడాదిన్నర నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. గుంతల మ యం కావడంతో పాటు రోడ్డుపై చెలరేగే దు మ్ము, ధూళితో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వర్షం వచ్చిందంటే ఏ గుంతలో ప డాల్సి వస్తోందోన్న భయంతో ప్రయాణం సా గించేవారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకా ణదారుల ఇబ్బందులు వర్ణనాతీతం. మూడేళ్ల పాటు దుమ్ము,ధూళితో సహజీవనం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థా నిక ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణం దృష్టి సాధించారు. పనులు జోరుగా సాగుతున్నా యి. ఇప్పటికే పీవీకేకే కళాశాల నుంచి చంద్రబాబు కొట్టాలకు వెళ్లే దారి వరకు బీటీ రోడ్డు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో వాహనదారుల రాకపోకలు సాఫీగా జరిగిపోనున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం స్థానికులు, వాహనదారులు సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 03 , 2024 | 12:34 AM