Share News

CHRIST MAS : క్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:45 AM

క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. అరవిందనగర్‌లోని సీయ్‌సఐ హోలి ట్రినిటి చర్చిలో సోమవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ప్రీక్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు.

CHRIST MAS : క్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం
Representatives and officials cutting the Christmas cake

ప్రీ క్రిస్మస్‌ వేడుకల్లో ఎంపీ అంబికా, ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. అరవిందనగర్‌లోని సీయ్‌సఐ హోలి ట్రినిటి చర్చిలో సోమవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ప్రీక్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌శర్మ అధ్యక్షతన నిర్వ హించిన కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి, క్రిస్మస్‌ శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రబాబు ఆదేశాల మేరకే క్రిస్మ్‌సను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మా ట్లాడుతూ... గతంలో పాస్టర్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇచ్చేవారని, దానిని ముఖ్యమంత్రి చంద్రబా బు రూ.8వేలకు పెంచారని గుర్తు చేశారు. అనంతరం పలు కోయర్‌ బృందాలు క్రీస్తు భక్తిగీతాలు ఆల పించ గా చర్చి ప్రెస్బిటర్‌ ఇన్చార్జ్‌ రెవరెండ్‌ బెనహర్‌బాబు ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. అనంతరం పలువురు పాస్టర్లను మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో నగరపాలక డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శమంతక మణి, టీడీపీ క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్‌, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి రామసుబ్బా రెడ్డి, క్రిస్టియన మైనార్టీ డీపీఎం మధుసూదనరెడ్డి, ఆర్డీ ఓ కేశవనాయుడు, డీసీహెచఎ్‌స డాక్టర్‌ పాల్‌ రవికు మార్‌, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, తహసీల్దార్‌ హరికు మార్‌, పాస్టర్లు భాస్కర్‌, జాన సుధీర్‌, కృపాదాసు, జాన సుధాకర్‌, విజయరాజు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 24 , 2024 | 12:45 AM