CITY : పారిశుధ్యానికి పరకలూ కరువే..!
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:36 AM
అనంతపురం నగరంలో పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదకర పను లు చేస్తున్న కార్మికులకు కనీస పనిముట్లు కరువ య్యాయి. దీంతో సరిగా మురుగు కాలువలు శుభ్రం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి వారిది. చెత్త ఎత్తివేయడా నికి పరికరాలు లేక ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారు. సమయానికి పరకలు అందజేయకపోతే వారే కొత్త పరకలు కొంటున్నారు.
కార్మికుల పరిస్థితి దయనీయం
పనిముట్ల నుంచి కొబ్బరినూనె వరకు ఎగవేతలే
అనంతపురం క్రైం, నవంబరు 12 (ఆంరఽధజ్యోతి) : అనంతపురం నగరంలో పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదకర పను లు చేస్తున్న కార్మికులకు కనీస పనిముట్లు కరువ య్యాయి. దీంతో సరిగా మురుగు కాలువలు శుభ్రం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి వారిది. చెత్త ఎత్తివేయడా నికి పరికరాలు లేక ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారు. సమయానికి పరకలు అందజేయకపోతే వారే కొత్త పరకలు కొంటున్నారు. గత కొన్నేళ్లుగా నగర పాలిక పరిధిలో పారిశుధ్య కార్మికులకు పూర్తి స్థాయిలో ఏనాడూ పరికరాలను పంపిణీ చేయలేదు. అధికారు లు మాత్రం ఆ నిధులను నిధులను పక్కదారి పట్టిం చి, కొన్నింటిని మాత్రమే కార్మికులకు అందజేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏటా ఈ దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది. పనిచేసేవారి కంటే పర్యవేక్షించే వారే ఎక్కువయ్యారు.
పరకలెక్కడ..?
నగరపాలికలో పారిశుధ్య విభాగంలో 409 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు, 135 మంది రెగ్యులర్ కార్మికు లు పనిచేస్తున్నారు. అందులో మహిళా కార్మికులకు తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకోసారి ఒక్కొక్కరికి పది కట్టలు(4 పరకలు) ఇవ్వాలి. కానీ గత కొన్నేళ్లుగా వాటిని ఏనాడు సరిగా పంపిణీ చేయలేదు. నాలుగు నెలల క్రితం కొన్ని సర్కిళ్లలో ఒక్కొక్కరికి రెండు కట్ట లు, మూడు, ఐదు కట్టల చొప్పున పంపిణీ చేశారు. అంతకుముందు గత ఏడాది ఇచ్చారని కార్మిక సంఘా ల నాయకులు చెబుతున్నారు. మహిళలకే చెత్త ఎత్త డానికి రెండు రేకులు, టబ్బులు ఇవ్వక ఎన్ని ఏళ్ల యిందో తెలియడం లేదని కార్మికులు వాపోతున్నారు. గాజు పదార్థాలు ఎత్తే సమయంలో ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏ కార్మికుడి చేతిలోనూ గ్లౌజులు కనిపించవు. ఫుష్‌కార్టులకు ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తు పట్టడానికి(తెల్లవారుజాము సమ యంలో) ఆప్రానలు రెండు ఇవ్వాలి. కానీ అవి ఎక్కడా లేవు.
మగవాళ్లకైతే మూడు నెలకోసారి రెండు పారలు, రెండు కడ్డీలు, ఒక గడ్డపారు, కాలువ బండి అందజేయాల్సి ఉంటుంది. అవేవీ లేవు. కాలువలు తీసే సమయంలో చేతికి గ్లౌజులు, కాళ్లకు మెత్తటి బూట్లు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో దారుణం ఏంటంటే దాదాపు రెండేళ్ల క్రితం నగరంలో వరదలు వచ్చిన సమయం లో దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకొచ్చి, మళ్లీ వెన క్కు ఇచ్చేశారట. ఇక 2019 లో దాదాపు 150 వరకు ఫుష్‌కార్ట్‌లు ఇవ్వగా అందు లో కార్మికులకు 100 ఇచ్చి నట్లు కార్మికులు చెబుతున్నా రు. అవి మరమ్మతులకు గురై ప్రస్తుతం పనికిరాకుండా పోయాయి. ఏడాదిగా వాటి గురించి అతీగతీ లేకుండా పోయింది.
ఏటా రూ.10లక్షల పైమాటే...
పనిముట్లు, పరికరాలు, పరకల విషయంలో కార్మికులకు ఇవ్వకుండా అధికారులు ధులు కాజేస్తు న్నారన్న ఆరోపణలున్నాయి. సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వ్యవహారం నడుపుతున్న ట్లు సమాచారం. వాటిని ఇవ్వకుండానే ఇచ్చినట్లు బి ల్లులు చేసుకోవడం, నిధులు మళ్లిస్తూ వచ్చారు. ఇలా ఏటా రూ.10లక్షల పైమాటే స్వాహా చేస్తున్నట్లు సమా చారం. ఇది వరకు కమిషనర్‌గా పనిచేసిన మేఘ స్వరూప్ ఉన్న సమయంలో తన చాంబర్‌లో మున్సిప ల్ యూనియన నాయకులతో, సంబంధిత అధికారు లతో మాట్లాడి రూ.5లక్షల నిధులతో పనిముట్లు, పరకలు అందజేయాలని ఆదేశించారని, కానీ అది రూ.60వేలకే పరిమితమైందని పలువురు కార్మికులు అంటున్నారు. ఈ విషయం ప్రస్తుత ఎంహెచఓ విష్ణుమూర్తికి తెలిసే ఉంటుందని సమాచారం.
ఎన్నాళ్లు అడగాలి..?- నాగభూషణం, మున్సిపల్ వర్కర్స్ యూనియన అధ్యక్షుడు
పరకల నుంచి పుష్‌కార్ట్‌ల వరకు పారిశుధ్య కార్మికులకు ఏవీ సరిగా లేవు. గ్లౌజులు లేకుండానే గాజుముక్కలు వంటి వాటిని తీయాలి. ఎంత మంది అధికారులు మారినా కార్మికుల సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రతి సోమవారం స్పందనలో ఎన్ని వినతులు ఇచ్చినా అదే పరిస్థితి. కార్మికులు చనిపో తున్నా పట్టింకునేవారు లేరు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....