CPM : ప్రజా సమస్యలపై నిత్య పోరాటం
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:23 AM
ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేసేది, దేశం లో ప్రజలకు కష్టం వస్తే అండగా నిలిచేది కమ్యూని స్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాం భూపాల్ పేర్కొన్నారు. స్థానిక గణేనాయక్ భవనలో ఆదివారం నిర్వహించిన సీపీఎం నగర ఎనిమిదో మహాసభలో రాంభూపాల్ ప్రసంగించారు. పాలకులు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు వెంటనే చూసేది కమ్యూనిస్టుల వైపే అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ప్రజాసమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని, అందుకే ప్రజలు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టు నాయకులవైపు చూస్తారన్నారు.
సీపీఎం మహా సభలో... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం కల్చరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) :ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేసేది, దేశం లో ప్రజలకు కష్టం వస్తే అండగా నిలిచేది కమ్యూని స్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాం భూపాల్ పేర్కొన్నారు. స్థానిక గణేనాయక్ భవనలో ఆదివారం నిర్వహించిన సీపీఎం నగర ఎనిమిదో మహాసభలో రాంభూపాల్ ప్రసంగించారు. పాలకులు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు వెంటనే చూసేది కమ్యూనిస్టుల వైపే అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ప్రజాసమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని, అందుకే ప్రజలు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టు నాయకులవైపు చూస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత చార్జీలు పెంచితే వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేశాయని గుర్తుచేశారు. పాలకులు తీసు కునే నిర్ణయాలపై ప్రజల్లో ఆగ్రహం వస్తే ఎవరూ ఆపలేరనడానికి గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజ యమే నిదర్శనమన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై జాతీయస్థాయిలో సీపీ ఎం నిరసనలు తెలిపిందన్నారు. వైసీపీ హయాంలో అంగనవాడీలు వారి సమస్యలపై 42 రోజుల సమ్మె చే శారని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పో వడం సబబు కాదన్నారు. కేంద్రంలోని మోదీ ప్ర భు త్వం కార్పొరేట్లను అడ్డం పెట్టుకుని, హిందుత్వాన్ని ముందుకు తెచ్చి, మతతత్వాన్ని రెచ్చగొడుతోందని వి మర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేంద్రకుమార్, బాలరంగయ్య, సావి త్రమ్మ, నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వీ నాయు డు, గోపాల్, వెంకటనారాయణ, ప్రకాష్, వలి, మసూ ద్, వెంకటేష్, ఎన్టీఆర్ శీన, ప్రసాద్, ఓబులేసు, ఇర్ఫా న, బుల్లే రాజు, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....