Share News

PENUKONDA ; రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కమిషనర్‌

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:22 AM

పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్‌ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.

PENUKONDA ; రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కమిషనర్‌
Municipal commissioner and TDP leaders inspecting the Konapuram road

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 12: పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్‌ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది. దీంతో రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


మంత్రి సవిత ఆదేశాల మేరకు అప్రమత్తమైన మునిసిపల్‌ అధికారులు, టీడీపీ నాయకులు మురుగు నీరును డైవర్ట్‌ చేశారు. అప్పటి నుంచి కోనాపురం వెళ్లే రహదారిలో డ్రైనేజీ పనులను యుద్దప్రాతిపదికన చేపట్టారు. మునిసిపల్‌ అధికారులు గురువారం టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులతో కలిసి డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కోనాపురం రోడ్డు నిర్మాణం మంజూరవుతుందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర్‌రావు, మండల కన్వీనర్‌ శ్రీరాములుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 13 , 2024 | 12:22 AM