STRIKE : కొనసాగిన సత్యసాయి కార్మికుల సమ్మె
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:42 AM
సత్యసాయి తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెలో భాగంగా ఆదివారం నా లుగో రోజు ఆత్మకూరు లోని సత్యసాయి వాటర్ సప్లై పంప్ హైస్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆర్నెల్లుగా తమకు జీతాలు ఇవ్వకుంటే కుటుంబ పోషణ ఎలా? అని ప్రశ్నించారు.ప్రబుత్వం వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆత్మకూరు, గార్లదిన్నె, సెప్టెంబరు 8: సత్యసాయి తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెలో భాగంగా ఆదివారం నా లుగో రోజు ఆత్మకూరు లోని సత్యసాయి వాటర్ సప్లై పంప్ హైస్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆర్నెల్లుగా తమకు జీతాలు ఇవ్వకుంటే కుటుంబ పోషణ ఎలా? అని ప్రశ్నించారు.ప్రబుత్వం వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి కార్మిక సంఘం నాయకులు ఓబ న్న, చిన్న, శ్రీధర్, మల్లి, సాయి ప్రసాద్ రెడ్డి, కేశవులు, శ్రీరాములు,హరి, దివాకర్, శివ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగి స్తామని నార్పలలోని సత్యసాయి తాగునీటి కార్మికులు పేర్కొన్నా రు. వారు చేపట్టిన సమ్మె ఆదివారానికి 18వ రోజుకు చేరింది. ఆదివారం కల్లూరు పంపుహౌస్ వద్ద నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, భాష, మల్లరాయుడు, సాంబశివ, జనార్దనరెడ్డి, శ్రీనివాసులు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....