Share News

MANDAL MEET : గంజాయి నిర్మూలనకు సహకరించండి

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:17 AM

గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు అణిచివేయాలన్నా, ముఖ్యంగా గంజాయి ని నిర్మూలించాలన్నా పార్టీలకు అతీతం గా స్థానిక ప్రజాప్రతినిధులు సహక రిం చాలని అబ్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు కో రారు. స్థానిక మండల పరిషత కార్యాల యంలో బుధవారం వైస్‌ ఎంపీపీ రఘు నాథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావే శం జరిగింది.

MANDAL MEET : గంజాయి నిర్మూలనకు సహకరించండి
CI Anjaneyulu speaking in the meeting

మండల సమావేశంలో సీఐ

హిందూపురం, ఆగస్టు 28 : గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు అణిచివేయాలన్నా, ముఖ్యంగా గంజాయి ని నిర్మూలించాలన్నా పార్టీలకు అతీతం గా స్థానిక ప్రజాప్రతినిధులు సహక రిం చాలని అబ్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు కో రారు. స్థానిక మండల పరిషత కార్యాల యంలో బుధవారం వైస్‌ ఎంపీపీ రఘు నాథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావే శం జరిగింది. ఈ సందర్భంగా అబ్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ...


టీ కొట్టులో కూడా గంజాయి ప్యాకెట్లు దొరికే స్థాయికి వచ్చిందంటే దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అయితే గంజాయి ప్రభావం భవిష్యత్తులో అర్థం అవుతుందన్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయన్నారు. ఎక్కడో ఒరిస్సా సరిహద్దులో ఉన్న గంజాయి హిందూపు రంలో కూడా దొరుకుతోందంటే దాని ప్రభావం ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకో వచ్చన్నారు. అసాంఘిక కార్యకలా పాల నిర్మూలనకు స్థానిక ప్రజాప్రతి నిధులు పోలీసులకు సహకరించా లని కోరారు.


అనంతరం పలు అంశా లపై సభ్యులు మాట్లాడారు. పూల కుంట సర్పంచ మంజునాథ్‌ మాటా ్లడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా... ఎంపీ డీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఫొటోలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమావేశ భవనంలో ఎందుకు ఫొటోలు ఏర్పాటు చేయలేదని ఎంపీడీఓ నరేంద్రను నిలదీశారు. వెంటనే ఏర్పాటు చేయిస్తామని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగభూషణం, ఎంపీడీఓ నరేంద్ర, ఏఓ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2024 | 12:17 AM