Vinayaka : దండాలయ్యా.. ఉండ్రాలయ్యా
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:35 AM
జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్త కోటికి కనువిందు చేశాడు. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ఎంతో అందంగా అలంకరించారు. ఉదయమే కొలుదీర్చిన బొజ్జ గనపయ్యకు వివిధ పత్రాలు, పూలు సమర్పించి పూజలు చేశారు. ఉండ్రాళ్లు, చెరుకు గడలు వివిధ రకాల పిండి వంటలను స్వామి ...
వాడవాడలా వినాయక చవితి వేడుకలు
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 8: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్త కోటికి కనువిందు చేశాడు. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ఎంతో అందంగా అలంకరించారు. ఉదయమే కొలుదీర్చిన బొజ్జ గనపయ్యకు వివిధ పత్రాలు, పూలు సమర్పించి పూజలు చేశారు. ఉండ్రాళ్లు, చెరుకు గడలు వివిధ రకాల పిండి వంటలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తిగీతాలు పాడుతూ తన్మయత్వం చెందారు. రాత్రిపూట ఆయా మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వినాయకా..! విఘ్నాలు తొలగించు
కలెక్టరు ప్రత్యేక పూజ
అనంతపురం టౌన, సెప్టెంబరు 8: ‘జిల్లా అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు స్వామీ’ అంటూ విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు కలెక్టరు వినోద్‌కుమార్ తెలిపారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సమీపం లోని కృష్ణ కళామందిరంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితులు ఆయన చేత గణనాథుడికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మారుతి, తహసీల్దార్లు రియాజుద్దీన, వసంతలత, బ్రహ్మయ్య, మోహన, జిల్లా రెవెన్యూ అసోసియేషన సెక్రెటరీ, జేఏసీ చైర్మన దివాకర్‌రావు, నారాయణస్వామి, సంజీవరెడ్డి, వర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....