DEVOTIONAL : భక్తిశ్రద్ధలతో దత్తజయంతి వేడుకలు
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:36 AM
దత్తజయంతిని ఆదివారం నగరంలోని దత్తమందిరాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పా తూరులోని దత్తాత్రేయ దేవస్థానంలో స్వామివారి మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ దత్తాత్రేయ వ్రతం నిర్వహించారు. అన్నదాన విని యోగం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని ఊరేగించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : దత్తజయంతిని ఆదివారం నగరంలోని దత్తమందిరాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పా తూరులోని దత్తాత్రేయ దేవస్థానంలో స్వామివారి మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ దత్తాత్రేయ వ్రతం నిర్వహించారు. అన్నదాన విని యోగం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని ఊరేగించారు. అదేవిధంగా హెచ్చెల్సీ కాలనీలోని వలీస్వామి ఆశ్రమం, రామచంద్రనగర్‌లోని షిర్డిసాయి బాబా ఆలయం, మూడో రోడ్డులోని షిర్డిసాయిబాబా ఆలయాల్లోనూ దత్తాత్రేయస్వామిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం దత్తనామకరణం, బ్రహ్మోపదేశం చేశారు. మహామంగళహారతి నివేదన అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన వినియోగం చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....