Share News

DEVOTIONAL : దీపం జ్యోతి... పరబ్రహ్మ

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:04 AM

కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలన్నీ భక్తకోటితో కిక్కిరిసి పోయాయి. భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగించి ముక్కంటిని దర్శించుకున్నారు. మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలోని శివుడికి రుద్రా భిషేకాలు, బిల్వార్చన, విశేష అలంకరణ చేశారు.

DEVOTIONAL : దీపం జ్యోతి... పరబ్రహ్మ
Kashivishweshwara on the first road

భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు ... భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

అనంతపురం కల్చరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలన్నీ భక్తకోటితో కిక్కిరిసి పోయాయి. భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగించి ముక్కంటిని దర్శించుకున్నారు. మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలోని శివుడికి రుద్రా భిషేకాలు, బిల్వార్చన, విశేష అలంకరణ చేశారు. సా యంత్రం ఆలయ ఆవరణలో భక్తులు దీపాలను వె లిగించి, కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై స్వామిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని ఎ మ్మెల్యేకి అందజేశారు. అనంతరం ఆమె ఆలయ ఆవ రణలో కార్తీక దీపం వెలిగించారు. అన్నదాన కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే హెచ్చెల్సీ కా లనీలోని మంజునాథస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆరో రోడ్డులోని అమృ తలింగేశ్వరాలయంలో అన్నాభిషేకం చేశారు. శారదా నగర్‌లోని శృంగేరి శంకరమఠం, పాతూరు విరూపా క్షేశ్వర దేవాలయం. మూడోరోడ్డు షిర్డిసాయిబాబా ఆలయం, బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆలయం, శివబాలయోగి ఆశ్రమం హౌసింగ్‌బోర్డులోని వెంకటేశ్వ రస్వామి ఆలయ ఆవరణం, శివాలయంలో భక్తులు పెద్దఎత్తున కార్తీక దీపాలను వెలిగించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 19 , 2024 | 12:04 AM