Share News

DHARNA : దేవరకొండ భూమిని కాపాడాలి

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:13 AM

మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

DHARNA : దేవరకొండ భూమిని కాపాడాలి
CPI leaders gathering at Tehsildar's office

సీపీఐ నాయకుల ఆందోళన

బుక్కరాయసముద్రం, సెప్టెంబరు18: మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.... బుక్కరాయసముద్రం పరిధిలోని సిద్ద రాంపురం రోడ్డు వద్ద ఉన్న దేవర కొండకు చెందిన కోట్ల విలువ చేసే ఆల యం భూమి సర్వేనెంబరు396-7లో 1.70 ఎకరాలను వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే యత్నించగా అప్పట్లో సీపీఐ ఆధ్వర్యంలో అడ్డుకున్నామన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కొంత మంది టీడీపీ నాయకుల సహాకారంతో వైసీపీ నేతలు తిరిగి కబ్జాకు యత్నిస్తున్నారన్నారు. వెంటనే ఈ భూమిలో దేవాలయం అధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌, భవన నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ పుణ్యవతికి వినతి పత్రం ఇచ్చారు. ఈ అంశంపై తహసీల్దార్‌ మాట్లాడుతూ... ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని బోర్డు పెట్టామన్నారు. ప్రైవేటు వ్యక్తులు ప్రవేశిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. సీపీఐ నాయకులు బండిరామక్రిష్ణ, శ్రీనివాసులు, భాష, వెంకట రాముడు, భాస్కర్‌, రామాంజినేయులు, నాగేంద్ర తదితరుల పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 19 , 2024 | 12:13 AM