DEVOTIONAL : ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:14 AM
ధనుర్మాస ఉత్సవాలకు సోమవారం నగరంలోని పలు ఆలయాల్లో శ్రీకారం చుట్టారు. సోమవారంతో ప్రారంభ మైన ఈ ఉత్సవాలు జనవరి 13వ తేదీ వరకు కొన సాగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలో ని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాస ఉత్సవాలకు సోమవారం నగరంలోని పలు ఆలయాల్లో శ్రీకారం చుట్టారు. సోమవారంతో ప్రారంభ మైన ఈ ఉత్సవాలు జనవరి 13వ తేదీ వరకు కొన సాగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలో ని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు. తపోవనంలోని శ్రీక్షేత్రం లో శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో గోదారంగనాథ స్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వితర ణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత, డాక్టర్ శ్రీనివాసన, రాజగోపాల్, రామాచార్యులు, శ్రీనివాస రాఘవన, సంధ్య, విష్ణు ప్రియ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే హెచ్చెల్సీ కాలనీలోని మంజునాథస్వామి దేవాలయం, నగర శివారులోని శివకోటి దేవాలయం, శివబాలయో గి ఆశ్రమాల్లోనూ స్వామివార్లకు వివిధ అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....