SCHOOL : శిథిలావస్థలో పాఠశాల భవనాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:59 PM
మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి.
కనగానపల్లి, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి. ఉన్న ఒక్క భవనం పైకప్పు కూడా పెచ్చులూడుతోంది. ఎప్పుడు పెచ్చులూడి పిల్లలపై పడుతాయోనని ఉఫాధ్యాయలు భయపడుతున్నారు. ఈ భయానికి తోడు వర్షం వచ్చిం దంటే తరగతి గదిలోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఉపాధ్యాయులు వరండాలో చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి తరగతి గదులు బాగు చేయాలని విధ్యార్థులతో పాటు గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....