WORKS : ఆగిన ఉపాధి పనులు
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:36 AM
గ్రామాల్లో వలసల నివారణ కోసం 2006, ఫిబ్రవరి 2న దేశంలో నే ఎ్కడ లేని విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కరువు సీమలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చారు. నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ప్రధా ని మన్మోహన సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.
మూడు నెలలుగా నిలిచిపోయిన వైనం
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
నార్పల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వలసల నివారణ కోసం 2006, ఫిబ్రవరి 2న దేశంలో నే ఎ్కడ లేని విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కరువు సీమలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చారు. నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ప్రధా ని మన్మోహన సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అయితే మండలంలోని ప్రస్తుత ప రిస్థితులు ఆ ఉపాధి పథకం పనులు కల్పించలేకుండా ఉన్నాయి. మండలంలో 17గ్రామ పంచాయతీలకు 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించారు. అయితే వారంతా వైసీపీకి మద్దతుగా ఉన్న వారినే ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ 17మంది స్థానంలో కొత్తవారిని నియమించాలని అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 17 మంది కూడా కూలీలకు పనులు కల్పించకుండా ఉండిపోయారు. వీరిలో నార్పల, గంగనపల్లి, సోదనపల్లిల్లో అప్పు డప్పుడు మాత్రమే మేట్ల ద్వారా పనులు కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఫీల్డ్ అ సిస్టెంట్ల తొలగింపు విషయంలో గ్రామీణ స్థాయి గ్రూప్ రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది. తమవారికే ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని నాయకులు అధికా రులతో తీవ్రస్ధాయిలో వాగ్వివాదానికి దిగారు. మరికొందరు గ్రూప్ రాజకీయాలకు తెరలేపి మండల స్ధాయి అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు పలు చోట్ల అడపాదడపా చేపట్టిన పనులను నిలిపి వేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మార్పు ఇప్పటికి ఓ కొలిక్కి రాకపోవ డంతో ఉపాధి పనులు నిలిపివేశారని మండలంలో చర్చించుకుంటున్నారు. గ్రామీణ గ్రూపు రాజకీయాల ను సము దాయించలేని పరిస్థితి అధికారుల్లో నెలకొన్నట్లు సమా చారం. దీంతో కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లను నియమిం చలేక, కూలీలకు పనులు కల్పించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు నెలలుగా ఉపాధి పనులు లేేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా మని మండలంలోని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండలంలోని రంగాపురం, సిద్దిరాచెర్ల, దిగుమర్రి, నాయినపల్లి, బండ్లపల్లి, నడిమిదొడ్డి, గడ్డంనాగేపల్లి, హెచశోధనపల్లి, తదితర గ్రామ పంచాయతీలో మూడు నెలలుగా ఉపాధి హామీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఫీల్డ్‌అసిస్టెంట్ల నియామకం కాకనే ఇబ్బంది - గంగావతి, ఎంపీడీఓ
నార్పల మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం గురించి గ్రామీణ ప్రజలు సమస్యలు తీసుకొస్తున్నారు. దీంతో పనులు నిలిపివేశాం. అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీ లో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....