VIGILANCE : మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా..?
ABN , Publish Date - Dec 08 , 2024 | 12:59 AM
మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా..? మీ ఇంట్లో పల్లలకు ఇలాంటి భోజనమే పెదతారా అంటూ విజిలెన్స డీఎస్పీ నాగభూషణం బీసీ బాయ్స్ హాస్టల్-2 వార్డెన భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరస య్య కాలనీ గంగమ్మ గుడి సమీపంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్-2ను ఆయన శనివారం విజిలెన్స సీఐ శ్రీనివాసు లు, ఏఓ వాసుప్రకాష్‌తో అకస్మికంగా తనిఖీ చేపట్టారు.
వార్డెనపై మండిపడ్డ విజిలెన్స డీఎస్పీ
అనంతపురం న్యూటౌన, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మీ ఇంటిని ఇలాగే పెట్టుకుంటారా..? మీ ఇంట్లో పల్లలకు ఇలాంటి భోజనమే పెదతారా అంటూ విజిలెన్స డీఎస్పీ నాగభూషణం బీసీ బాయ్స్ హాస్టల్-2 వార్డెన భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరస య్య కాలనీ గంగమ్మ గుడి సమీపంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్-2ను ఆయన శనివారం విజిలెన్స సీఐ శ్రీనివాసు లు, ఏఓ వాసుప్రకాష్‌తో అకస్మికంగా తనిఖీ చేపట్టారు. అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని మందలించారు. మరుగుదొడ్లు ఇంత దారణంగా ఉంటే విద్యార్థులు ఎలా వినియోగి స్తారన్నారు. అనంతరం భోజనాన్ని పరిశీలించి వంటలు రుచికరంగా లేవన్నారు. నిత్యవసర సరుకుల విషయంలో రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉందని డీఎస్పీ తెలిపారు. బయోమెట్రిక్ హాజరులో పొంతన లేదన్నారు. వైద్య సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు పలువురు విద్యార్థులు తన దృష్టికి తెచ్చినట్లు ఆయన పెర్కొన్నారు. విద్యార్థులు పలు వ్యాధులతో బాధపడుతున్నట్లు తనికీల్లో బయటపడిందని తెలిపాన్నారు. 111 మంది విద్యార్థులకు కేవలం నాలుగు స్నానపు గదులు, నాలుగు మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. వాటినీ వినియోగించలేని దుస్థితిలో ఉన్నాయన్నారు. విద్యార్ధులు ఉన్న గదులు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ఇక్కడ నెలకొన్న సమస్యలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని, అందుకు తగిన విధంగా తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.