OFFICE : ఖాళీగా డీటీ సీటు
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:44 PM
తహసీ ల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్ తరువాత డిప్యూటీ తహసీ ల్దార్ పోస్టు కీలకం. తహసీల్దార్ అందుబాటులో లేక పోయి నా.. .డిప్యూటీ తహసీల్దార్ ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అటు వంటి పోస్టు అనంతపురం రూరల్ మం డలం తహసీల్దార్ కార్యాలయంలో రెండు మూడు నెలలుగా ఖాళీ ఉంది.
మూడు నెలలుగా ఇదే పరిస్థితి
అనంతపురం రూరల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): తహసీ ల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్ తరువాత డిప్యూటీ తహసీ ల్దార్ పోస్టు కీలకం. తహసీల్దార్ అందుబాటులో లేక పోయి నా.. .డిప్యూటీ తహసీల్దార్ ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అటు వంటి పోస్టు అనంతపురం రూరల్ మం డలం తహసీల్దార్ కార్యాలయంలో రెండు మూడు నెలలుగా ఖాళీ ఉంది. మూడు నెలల కిందట జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా తొలుత కలెక్టరేట్‌లో పనిచేసే సోమశేఖర్ అనే అధికారిని ఇక్కడ డీటీగా నియమించారు. కానీ ఆయన విధుల్లో చేరలేదు. కొద్ది రోజులకు శింగనమల కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాష్ రావు అనే అధికారిని నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన కూడా విధుల్లో చేరలేదు. దీంతో తిరిగి శింగనమలకే పోస్టింగ్ ఇస్తూ ఉత్త ర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత ఎవరినీ నియమించక పోవడంతో రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో డీటీ సీటు ఖాళీగానే ఉండిపోయింది. రూరల్ మండలంలో కోర్టు కేసులు ఎక్కువ. దీనికితోడు నిత్యం కార్యాలయానికి ప్రజలు తమ సమస్యలపై వస్తుంటారు. ఇక్కడి తహసీల్దార్‌కు నిత్యం మీటింగ్‌లు ఇతరాత్ర వాటికే సమయం సరిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్‌ను నియమిస్తే కొంత ప్రయోజనం ఉటుందని ఇటు కార్యాలయం వర్గాలు, అటు ప్రజలు అంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....