STU : ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : ఎస్టీయూ
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:34 AM
ఉద్యోగ, ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పెంగింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణా రెడ్డి, రామాంజినేయులు డిమాండ్ చేశారు. నార్పల మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
నార్పల, సెప్టెంబరు20: ఉద్యోగ, ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పెంగింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణా రెడ్డి, రామాంజినేయులు డిమాండ్ చేశారు. నార్పల మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగ, ఉపాధ్యా యులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే దీర్ఘకాలిక బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకటన జాప్యం అవుతున్న నేపధ్యంలో వెంటనే ఉద్యోగ, ఉపాధ్యా యులకు 30శాతం ఐఆర్ ప్రకటించాలని, 117జీఓను రద్దు చేయాలని, పని సర్దుబాటు అసంబద్ధాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, మండల నాయకులు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....