Share News

DASARA : ఘనంగా దసరా వేడుకలు

ABN , Publish Date - Oct 14 , 2024 | 12:20 AM

దసరా వేడుకలు శని వారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అమ్మవారి ఆలయాలన్నింటి లో సందడి నెలకొంది. దసరా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు భ క్తులకు రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు విజయదశమి సందర్భంగా శనివారం ప్రత్యేక అలంకరణల్లో దర్శనమిచ్చారు.

DASARA : ఘనంగా దసరా వేడుకలు
Devotees circumambulating the Samivriksha tree at Raghavendraswamy Temple on the first road

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 13 : దసరా వేడుకలు శని వారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అమ్మవారి ఆలయాలన్నింటి లో సందడి నెలకొంది. దసరా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు భ క్తులకు రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు విజయదశమి సందర్భంగా శనివారం ప్రత్యేక అలంకరణల్లో దర్శనమిచ్చారు. గుల్జార్‌ పేట లోని కొత్తూరు వాసవీ ఆలయంలో మూలవిరాట్‌ను స్వర్ణకవచ చీరతో, ఉత్స వ మూర్తిని వాసవీ కన్యకాపరమేశ్వరి దర్బార్‌గా అలంకరించారు. పాతూ రులోని వాసవీ ఆలయంలో మూలవిరాట్‌ను స్వర్ణకవచ చీరతో, ఆలయ ఆవరణలోని ఉత్సవమూర్తికి సప్తమా తృకల అలంకారం చేశారు. శారదా నగర్‌లోని శృంగేరి శంకరమఠంలో అ మ్మవారు గజలక్ష్మిగా, మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు. రామచంద్రనగర్‌లోని షిర్డీసాయి దేవాలయంలో అమ్మవారికి మహిషాసురమర్ధిని అలంకారం చేశారు. సాయిన గర్‌ నాలుగో క్రాస్‌లోని కనకదుర్గ భ వాని ఆలయం, జీసస్‌నగర్‌లోని రేణు కా యల్లమ్మ ఆలయం, హెచ్చెల్సీ కాలనీలోని చాముండేశ్వరి ఆలయం, పాతూరులోని బీరప్ప గడివద్దనున్న యల్లమ్మ ఆలయం, అశోక్‌నగర్‌లోని హరిహర దేవాలయం, ఐదోరోడ్డులోని రేణుకా యల్లమ్మ, మొదటిరోడ్డు, గుత్తిరోడ్డులోని చౌడేశ్వరి ఆలయాల్లోనూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేశారు. ఉదయం నుం చి సాయంత్రం వరకూ భక్తులతో ఆలయాలన్నీ సందడిగా కనిపించాయి. పలుప్రాంతాల్లో ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి ఊరేగించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 14 , 2024 | 12:20 AM