Share News

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:16 AM

పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌
Seized two-wheelers

అంతర్రాష్ట్ర దొంగల ముటా అరెస్టు

31 బైక్‌ల స్వాధీనం

పావగడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 31 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పావగడ పోలీసు స్టేషనలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన హరీష్‌, బుక్కపట్నం మండలం జానకంపల్లి వాసి సాయిపవన, మేకలపల్లికి చెందిన మనోహర్‌ ముఠాగా ఏర్పడ్డారు. పార్క్‌ చేసిన ఖరీదైన బైక్‌లను అపహరించేవారు. వాటిని విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని సీరియ్‌సగా పరిగణించి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పావగడ పట్టణంలోని రాజవంతి రిలాక్స్‌ బార్‌ వద్ద హరీ్‌షను అరెస్టు చేసి, వివచారించగా.. చోరీల గుట్టు రట్టయింది. మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి 6 రాయల్‌ ఎనఫీల్డ్‌, 7 బజాజ్‌ పల్సర్‌, రెండు అపాచీ, రెండు ఆర్‌ఎక్స్‌ 100, రెండు కేటీఎం డూక్‌, 7 హీరో స్ల్పెండర్స్‌, మూడు ప్యాషన ప్రో, రెండు హోండా షైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - Nov 28 , 2024 | 12:16 AM